త్రివిక్రమ్ ఎన్టీఆర్ మార్క్ ఎక్కడ !

September 20, 2018 at 12:13 pm

ఎన్టీఆర్ తాజా చిత్రం అరవింద సమేత వీర రాఘవ సినిమాను దసరా కానుకగా అక్టోబర్ 11వ తేదీన విడుదల చేయనున్నట్టు త్రివిక్రమ్ ముందుగానే ప్రకటించారు. ఈ నేపథ్యంలో సినిమా పనులు వేగంగా పూర్తి చేస్తున్నారు. ఒక వైపున చిత్రీకరణను పూర్తి చేస్తూ మరో వైపున ఒక్కో లిరికల్ వీడియోను వదులుతున్నారు. ఇప్పటికే రిలీజ్ చేసిన మొదటి పాటకు ఎంతో మంచి రెస్పాన్స్ వచ్చింది. అయిదే అది రొమాంటిక్ ఇంట్రడ్యూసింగ్ సాంగ్ లా ఉంది. నిన రిలీజ్ చేసిన సాంగ్ పూర్తిగా సెంటిమెంట్ కోణంలో సాగింది.42133603_1899611403465582_9001286149926289408_n

అజ్ఞాతవాసి చిత్రంలో కథ లేదని త్రివిక్రమ్‌ని అంతా విమర్శించడంతో ఈసారి కథాపరంగా లోటు లేకుండా చూసుకున్నాడని ఈ పాట చూస్తే తెలుస్తోంది. ఈ సాంగ్ విన్న ప్రతి ఒక్కరు తప్పకుండా కంటతడి పెట్టుకోవాల్సిందే. లిరిక్స్ రైటర్ రామజోగయ్య శాస్త్రి చెప్పినట్టుగా ఈ పాట పదికాలాలపాటు గుర్తుండి పోతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే ఈ మద్య సెంటిమెంట్ సాంగ్స్ కి మంచి ఆదరణ వస్తున్న విషయం తెలిసిందే.

ఆ మద్య చిరంజీవి నటించిన ఖైదీ నంబర్‌ 150లో ‘నీరు నీరు’, రంగస్థలం లో ‘ఓరయ్యో’ పాటల్ని ఆడియన్స్ గుండెలకు హత్తుకు పోయాయి. నిన్న రిలీజ్ అయిన పాట తో ఇక మరో రెండు పాటలు రిలీజ్ కి సిద్దంగా ఉన్నట్లు తెలుస్తుంది. అయితే ఆ పాటల్లో ఏమాత్రం జోష్ లేకుంటే తారక్‌ తరహాలో వుండే మాస్‌ సినిమాయేనా కాదా అని బెంగ పెట్టుకున్నారు అభిమానులు. ఎన్టీఆర్‌లాంటి మాస్‌ హీరోకి అతని మార్కు పాటలు విడుదల చేయకుండా ఇలాంటి విషాద భరిత పాటల్ని ఆడియోలో పెట్టడమేంటని కొందరు అభిమానులు ఫైర్ అవుతున్నారు. మిగతా రెండు పాటలైనా బాగా ఊపున్నవీ, ఎన్టీఆర్‌ డాన్సులకి అనుగుణంగా వుండేవీ కావాలని వారు ఆకాంక్షిస్తున్నారు.

త్రివిక్రమ్ ఎన్టీఆర్ మార్క్ ఎక్కడ !
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share