‘అరవింత సమేత’ శాటిలైట్ రైట్స్ బీభత్సం

October 12, 2018 at 5:12 pm

ఇండస్ట్రీలో ఇద్దరు హేమా హేమీలు కలిస్తే..వచ్చే రిజల్ట్..మామూలుగా ఉండదు..ఇప్పుడు టాలీవుడ్ లో అదే పరిస్థితి. తెలుగు రాష్ట్ర ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న త్రివిక్రమ్ – ఎన్టీఆర్ కాంబినేషన్ లో వచ్చిన సినిమా ‘అరవింద సమేత’ నిన్న రిలీజ్ అయ్యింది. నందమూరి ఫ్యాన్స్ ఆశించినట్లుగా ఫస్ట్ డే పాజిటీవ్ టాక్ రావడంతో ఇప్పుడు వసూళ్లు కూడా దిమ్మతిరిగిపోతున్నాయి. ఎన్టీఆర్ – త్రివిక్రమ్ లపై ప్రేక్షకులు మరియు ఫ్యాన్స్ పెట్టుకున్న నమ్మకం వమ్ము కాలేదు. ఈ దసరాకు భారీ వసూళ్లను ఈ చిత్రం రాబట్టడం ఖాయం అని తేలిపోయింది.43878383_1924652097628179_7563382965250555904_n

ఓవర్సీస్ లో కూడా ఈ సినిమా కలెక్షన్లు కుమ్మేస్తున్నాయి. ఈ నెలలో పెద్ద సినిమాలు ఏవీ లేకపోవడంతో అందరి దృష్టి అరవిందుడిపైనే పడింది. అందులోనూ సినిమా హిట్ టాక్ రావడం..రివ్యూలు కూడా పాజిటీవ్ గా ఉండటంతో కలెక్షన్లు కూడా అనుకున్న రేంజ్ దాటుతున్నాయి. ఓపెనింగ్స్ కలెక్షన్స్ ఇప్పటికే సినిమా రేంజ్ ను పెంచేసిన నేపథ్యంలో తాజాగా శాటిలైట్ రైట్స్ భారీ మొత్తానికి అమ్ముడు పోయినట్లుగా టాక్ వినిపిస్తుంది. సినిమా విడుదలకు ముందు ఈ చిత్రం శాటిలైట్ రైట్స్ను 20 కోట్ల వరకు కొనుగోలు చేసేందుకు జీ తెలుగు మరియు స్టార్ మాలు పోటీ పడ్డాయట..కానీ సినిమాపై గట్టి నమ్మకం ఉన్న నిర్మాత శాటిలైట్ రైట్స్ అమ్మకుండా జాప్యం చేశారట.

ఇంకేముంది సినిమా హిట్ టాక్ రావడంతో ఆ రెండు ఛానల్స్ మరింత పోటీకి దిగాయట. ఈ నేపథ్యంలో ఈ చిత్రాన్ని జీ తెలుగు ఛానెల్ 23.5 కోట్లకు కొనుగోలు చేసినట్లుగా ఫిల్మ్ సర్కిల్స్ లో ప్రచారం జరుగుతుంది. ఈమద్య కాంలో శాటిలైట్ రైట్స్ కు భారీ డిమాండ్ పెరిగింది. అందుకే అరవిందకు ఈ రేంజ్ లో శాటిలైట్ రైట్స్ పలికినట్లుగా సినీ వర్గాల వారు చెబుతున్నారు. ఇక బుల్లితెరపై ఎన్టీఆర్ కి ఉన్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. బిగ్ బాస్ సీజన్ 1 కి మనోడే హోస్టింగ్ చేసి తెలుగు రాష్ట్ర ప్రజలకు మరింత దగ్గరయ్యాడు.

ఇక త్రివిక్రమ్ సినిమాలు బుల్లి తెరపై ఇప్పటి వరకు పలు సంచలన టీఆర్పీ రికార్డులను దక్కించుకున్న విషయం తెల్సిందే. అదే నమ్మకంతో జీ తెలుగు సంస్థ కొనుగోలు చేసినట్లుగా ప్రచారం జరుగుతుంది. . ఇప్పుడు శాటిలైట్ రైట్స్ – ప్రైమ్ వీడియో రైట్స్ ద్వారా మరింతగా నిర్మాత రాధాకృష్ణ లాభాలను దక్కించుకోబోతున్నాడంటున్నారు.

‘అరవింత సమేత’ శాటిలైట్ రైట్స్ బీభత్సం
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share