ఆ విషయంలో ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి చేదు వార్త

September 18, 2018 at 12:33 pm

ప్రముఖ దర్శకులు బాబి దర్శకత్వంలో వచ్చిన ‘జై లవకుశ’సినిమాలో నటించిన ఎన్టీఆర్ చాలా గ్యాప్ తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ‘అరవింద సమేత’సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో ఎన్టీఆర్ రెండు డిఫరెంట్ స్టైల్లో కనిపించబోతున్న విషయం తెలిసిందే. సినిమా ప్రథమార్థంలో కాలేజ్ వాతావరణంతో ఎంతో జాయ్ ఫుల్ గా ఉండే పాత్రలో కనిపించే ఎన్టీఆర్ ఇంట్రవెల్ తర్వాత మొత్తం రాయలసీమ బ్యాగ్ డ్రాప్ లో కనిపించబోతున్నాడట. ఈ పాత్రలో ఎన్టీఆర్ విశ్వరూపం కనిపించబోతున్నట్లు మొన్నామద్య రిలీజ్ అయిన టీజర్ చూస్తే అర్థం అవుతుంది.

DnXMB6UWsAA7wm5 copy

అయితే ఎన్టీఆర్ ఏ రేంజ్ పాత్రలో నటించినా..ఫ్యాన్స్ మాత్రం ఆయన స్టైలిష్ డ్యాన్స్ అంటే పడిఛస్తారు. ఇప్పుడు ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి బ్యాడ్ న్యూస్ అంటూ ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఈ సినిమా అక్టోబర్‌ 11న విడుదల చేయాలని ఫిక్స్‌ అయ్యారు. ఈ కారణంగా విదేశాల్లో చిత్రీకరించాలని భావించిన ఒక పాటని వదిలేసుకున్నారు. కానీ ఉన్న సమయం చాలా తక్కువ..ఈ లోపు ఆడియే వేడుకలు నిర్వహించాలి..ఇతర పనులు చక్కదిద్దుకోవాలి..అందుకే ఓ పాటను క్యాన్సిల్ చేసుకున్నట్లు టాక్ వినిపిస్తుంది.

ఈ చిత్రంలో కేవలం నాలుగు పాటలే వుండనున్నాయి. అందులోను ఒకటి బ్యాక్‌గ్రౌండ్‌ సాంగ్‌ అట. మొన్న రిలీజ్‌ అయిన పాట మెలోడీ కనుక ఎన్టీఆర్‌ డాన్సులు చేయడానికి స్కోప్‌ లేదు. మరో పాట కూడా స్లోగానే వుంటుందనే టాక్‌ వుంది. మొత్తానికి ఈ సినిమాలో ఎన్టీఆర్ చేసేది ఒకే పాటపై డ్యాన్స్..మరి ఇది ఫ్యాన్స్ ఎలా జీర్ణించుకుంటారో చూడాలి. ఈ కొరతని తీర్చేలా త్రివిక్రమ్‌ ఎటువంటి అదనపు మసాలాలు పెడతాడో చూడాలి.

ఆ విషయంలో ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి చేదు వార్త
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share