అర‌విందుడి ఇంట‌ర్వెల్ ద‌ద్ద‌రిల్లేలా..!

October 4, 2018 at 9:48 am

‘మదిరప్పా.. ఇక్కడ మంది లేరా? కత్తులు లేవా?’ అంటూ ఎన్టీఆర్ గ‌ర్జించిన తీరుతో అభిమాన లోకం ఊగిపోతోంది. చొక్కా విప్పి..సిక్స్‌ప్యాక్‌తో వేటాడే సింహంలా దూసుకొచ్చిన ఎన్టీఆర్ రూపం అభిమానుల‌ను నిద్దుర‌పోనివ్వ‌డం. ఈ మాస్ యాక్ష‌న్ మామూలుగా ఉండ‌ద‌నీ.. థియేట‌ర్ ద‌ద్ద‌రిల్లిడం ఖాయ‌మ‌నీ.. ఈ సీనే సినిమాలో ఇంట‌ర్వెల్ అనే టాక్ వినిపిస్తోంది. మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్‌- ఎన్టీఆర్ కాంబినేష‌న్‌లో వ‌స్తున్న తొలి సినిమా అర‌వింద స‌మేత వీర‌రాఘ‌వ‌. మంగళవారం జరిగిన ప్రీరిలీజ్‌ వేడుకలో థియేట్రికల్‌ ట్రైలర్‌ విడుదల చేసిన సంగతి తెలిసిందే. దీనికి అభిమానుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. కేవలం 12 గంటల్లోనే 50లక్షల మందికి పైగా ఈ ట్రైలర్‌ను వీక్షించారు.43038248_1914390855320970_295565643422367744_n

ఈ చిత్రం ట్రైల‌ర్‌ సినిమాపై అంచ‌నాల‌ను భారీగా పెంచింది. త్రివిక్ర‌మ్ మార్క్ కామెడీ, త‌న‌దైన త‌త్త్వం, ఎమోష‌న్‌ల క‌ల‌బోత‌గా వ‌స్తున్న ఈ చిత్రంలో ఇంట‌ర్వెల్ సీనే మొత్తానికి హైలెట్‌గా నిలుస్తుంద‌ని అభిమానులు అంటున్నారు. ఇక రెండు కోణాల్లో ఎన్టీఆర్ క‌న‌బ‌డ‌డం కూడా అభిమానుల్లో మ‌రింత ఆస‌క్తిని పెంచుతోంది. ల‌వ‌ర్‌బాయ్‌గా.. రాయ‌ల‌సీమ కుర్రాడిగా ఎన్టీఆర్ త‌న పాత్ర‌కు జీవం పోశార‌నే చెప్పొచ్చు. ముఖ్యంగా ఫ్యాక్ష‌న్‌ నేపథ్యంలో వచ్చే సన్నివేశాల్లో తనదైన మాస్‌ యాక్షన్‌తో కట్టిపడేశారు. అయితే.. ఈ సినిమా ముగింపులో మాత్రం ఎలాంటి వ‌యెలెన్స్ లేకుండా గుండెల్ని పిండేసేలా భావోద్వేగ స‌న్నివేశాలు ఉంటాయ‌ని ఇండ‌స్ట్రీ వ‌ర్గాలు అంటున్నాయి.42852513_322481414996631_3739012899411066880_n

ఫ్యాక్ష‌న్ నేప‌థ్యంలో చెల్లాచెదురైన క‌న్నీటి బ‌తుకుల వ‌ల‌బోత‌గా అర‌వింద స‌మేత‌.. ఉంటుంద‌నే టాక్ వినిపిస్తోంది. ఫ్యాక్ష‌న్ క‌థ కొత్త‌దే అయినా.. చూపించ‌డంలో, చెప్ప‌డంలో.. న‌డిపించ‌డంలోనే త్రివిక్ర‌మ్ కొత్త‌ద‌నం ఉంటుంద‌నీ.. అదే త్రివిక్ర‌మ్ మాయ‌జాల‌మ‌ని ప‌లువురు అంటున్నారు. ఏదేమైనా.. ఎన్టీఆర్‌-త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో.. హారిక అండ్‌ హాసిని క్రియేషన్స్‌ పతాకంపై ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇక‌ తమన్ అందించిన బాణీలు అల‌రిస్తున్నాయి. ద‌స‌రా పండుగ‌కు ముందు అక్టోబరు 11న ఈ సినిమా విడుద‌ల కానుంది. ఈ తేదీ కోస‌మే అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నారు.

అర‌విందుడి ఇంట‌ర్వెల్ ద‌ద్ద‌రిల్లేలా..!
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share