‘అరవింద’ ప్రీ రిలీజ్ బుకింగ్ కలెక్షన్ ఊహలకు మించినదే

October 10, 2018 at 7:15 pm

తెలుగు సినీ పరిశ్రమలో సూపర్ హిట్ కాంబినేషన్ అని త్రివిక్రమ్ – పవన్ కళ్యాన్ లను అంటారు. అయితే ఆ మద్య త్రివిక్రమ్ దర్శకత్వంలో పవన్ కళ్యాన్ నటించిన ‘అజ్ఞాతవాసి’ అట్టర్ ఫ్లాప్ అయ్యింది. ఒకదశలో ఈ సినిమా త్రివిక్రమ్ తీశాడా..లేక వేరెవరైనా చేశారా అన్న టాక్ వచ్చింది. దాంతో ఈసారి త్రివిక్రమ్ అన్ని విషయాల్లో జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు మొదటి నుంచి చెబుతూనే ఉన్నారు. అయితే టాలీవుడ్ లో మొదటి సారిగా ఎన్టీఆర్ – త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో వస్తున్న ‘అరవింద సమేత’సినిమాపై భారీ అంచనాలే పెట్టుకున్నారు.

రాయలసీమ బ్యాగ్ డ్రాప్ లో సాగే ఈ సినిమాలో ఇప్పటి వరకు ఎవరూ చెప్పని అద్భుతమైన మెసేజ్ ఉండబోతుందని దర్శకుడు చెబుతున్నాడు. ఇదిలా ఉంటే..ఇప్పుడు టాలీవుడ్ లో ‘అరవింద సమేత వీరరాఘవ’ ఫీవర్ పట్టుకుంది. రేపు ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కాబోతున్న ఈ సినిమా..బెనిఫిట్, స్పెషల్ షో లు కూడా ఉన్నాయి. ఏపీ సర్కార్ బెనిఫిట్ షోలకు సైతం గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంతో వసూళ్ల మీద కొత్తకొత్త అంచనాలు పుట్టుకొస్తున్నాయి.

అంతే కాదు ఈ దసరాకు పెద్ద సినిమాలు ఏవీ పోటీకి లేవు..మొన్న విడుదలైన విజయ్ దేవరకొండ ‘నోటా’ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. దాంతో ఈసారి దసరా పండుగ ఎన్టీఆర్ దే అని అంటున్నారు ఫ్యాన్స్. ఈ కాలిక్యులేషన్స్‌కి బలం చేకూరుస్తూ.. ఓవర్సీస్ నుంచి లేటెస్ట్‌గా ఒక బ్రేకింగ్ న్యూస్! ప్రీ రిలీజ్ బుకింగ్స్ ద్వారా ‘అరవింద’కు వచ్చిన కలెక్షన్ ఊహలకు మించినదే అంటున్నారు.

అమెరికాలో మొత్తం 39 లొకేషన్స్‌లో లక్షా పదివేల డాలర్లు వసూలైనట్లు తేలిందట..ఒకదశలో హాలీవుడ్ సినిమా కలెక్షన్లకు మించి ఉందట. మరి ఫస్ట్ షో పడ్డ తర్వాత సినిమాకు హిట్ టాక్ వచ్చిందంటే..ఇక ఎన్టీఆర్ ని.. హారికా హాసినీ వాళ్ల ఆపే ముచ్చటే లేదట..ఈ సంస్థకు కాసల వర్షం కురవడం ఖాయం అంటున్నారు.

‘అరవింద’ ప్రీ రిలీజ్ బుకింగ్ కలెక్షన్ ఊహలకు మించినదే
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share