“అరవింద సమేత వీర రాఘవ ” ప్రీమియర్ షో టాక్

October 11, 2018 at 7:23 am

సినిమా: అర‌వింద స‌మేత వీర రాఘ‌వ‌..
విడుద‌ల‌: 11-10-2018
న‌టీన‌టులు: ఎన్టీఆర్‌, పూజా హెగ్డె, జ‌గ‌ప‌తిబాబు, నాగ‌బాబు, సీనియ‌ర్ న‌రేశ్‌, రావు ర‌మేశ్‌ త‌దిత‌రులు
నిర్మాణ సంస్థ‌: హారిక‌- హాసిని
ద‌ర్శ‌క‌త్వం: త‌్రివిక్ర‌మ్‌
సంగీతం: త‌మ‌న్‌

అర‌వింద స‌మేత వీర రాఘ‌వ సినిమా మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్‌, యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్ కాంబినేష‌న్‌లో వ‌చ్చిన తొలి సినిమా. పూజా హెగ్డె హీరోయిన్‌. హారిక‌-హాసిని క్రియేష‌న్‌లో నిర్మించిన చిత్ర‌మిది. ద‌స‌రా కానుక‌గా ఈనెల 11న సినిమాను విడుద‌ల చేస్తున్నారు. ఎన్నాళ్ల నుంచో ఎదురు చూస్తున్న త్రివిక్ర‌మ్‌-ఎన్టీఆర్ కాంబినేష‌న్‌లో వ‌స్తున్న సినిమా కావ‌డంతో అంచ‌నాలు భారీగానే ఉన్నాయి. ఇక ట్రైల‌ర్ రిలీజ్‌తో అంచ‌నాలు మ‌రింత‌గా పెరిగాయి. ట్రైల‌ర్‌లో ఎన్టీఆర్ డైలాగ్స్ ఇప్ప‌టికే అభిమానుల‌ను ఊపేస్తున్నాయి. ఇక త‌మ‌న్ అందించిన బాణీలు జనానికి క‌నెక్ట్ అయ్యాయి. ఓవ‌ర్సీస్‌లో విడుద‌ల అయిన అర‌వింద స‌మేత వీర‌రాఘ‌వ సినిమా ప్రీమియ‌ర్ షో టాక్ ఎలా ఉందో చూద్దాం.

నిజానికి.. ఫ్యాక్ష‌న్ నేప‌థ్యంలో చాలానే సినిమాలు వ‌చ్చాయి. కానీ.. త్రివిక్ర‌మ్ అందులోనే కొత్త కోణాన్ని ఎంచుకుని క‌థ‌ను న‌డిపించిన తీరే ఇక్క‌డ సినిమాకు ప్ర‌ధాన ఆక‌ర్శ‌ణ‌గా చెప్పుకోవ‌చ్చు. ఫ‌న్‌, యాక్ష‌న్‌, ఎమోష‌న్ల క‌ల‌బోత‌గా సినిమాను తీర్చిదిద్దిన తీరు చాలా కొత్త‌గా ఉంద‌నే టాక్ వినిపిస్తోంది. త్రివిక్ర‌మ్ మ‌రోసారి త‌న పెన్ పవర్ ఏమిటో చూపించాడ‌ని చెప్పుకోవ‌చ్చు. వీర రాఘ‌వ‌రెడ్డి పాత్ర‌లో ఎన్టీఆర్ సింపుల్‌గా ఎంట్రీ ఇవ్వ‌డం.. ఆత‌ర్వాత స‌న్నివేశాల‌కు త‌గ్గ‌ట్టుగా ఆయ‌న యాక్ష‌న్‌లో వ‌చ్చే ఛేంజెస్ సినిమాకు హైలెట్‌గా నిలుస్తాయ‌నే టాక్ వినిపిస్తోంది. రెండు గ్రామాల మ‌ధ్య‌.. రెండు వ‌ర్గాల మ‌ధ్య సాగే హైఓల్టేజ్ స‌న్నివేశాలు మాత్రం సూప‌ర్ అనే చెప్పాలి.

అంతేగాకుండా.. ఈ సినిమాలో వ‌చ్చే ట్విస్ట్‌లతో త్రివిక్ర‌మ్ తానంటే ఏమిటో మ‌రోసారి చూపించార‌ని చెప్పొచ్చు. ఫస్టాఫ్, సెకండాఫ్‌లో స‌న్నివేశాల‌న్నీ సునీల్‌, ఎన్టీఆర్‌, పూజా హెగ్డెల మ‌ధ్య సాగే ఫ‌న్నీ స‌న్నివేశాలు.. ఇంట‌ర్వెల్ ముందు వ‌చ్చే ట్విస్ట్‌తో మొద‌టి భాగం సూప‌ర్ అనే టాక్ వినిపిస్తోంది. ఇక జ‌గ‌ప‌తి, నాగ‌బాబుల వ‌ర్గాల మ‌ధ్య సాగే ఫ్యాక్ష‌న్ స‌న్నివేశాలను ఆక‌ట్టుకునేలా మ‌ల్చ‌డంలో త్రివిక్ర‌మ్ త‌న మార్క్ చూపించార‌నే చెప్పొచ్చు. ఇక రావు ర‌మేశ్‌, సీనియ‌ర్ న‌రేశ్‌, న‌వీన్‌చంద్ర‌లు త‌మ పాత్ర‌ల‌కు న్యాయం చేశారు. మొత్తంగా అంద‌రూ ఊహించిన‌ట్టుగానే ఫ్యాక్ష‌న్‌తో చిద్ర‌బైన బ‌తుకుల్ని భావోద్వేగంతో చూపించ‌డం సినిమాకు హైలెట్ అనే చెప్పాలి.

చివ‌రిగా..: అర‌విందుడు అద‌ర‌గొట్టాడు..

“అరవింద సమేత వీర రాఘవ ” ప్రీమియర్ షో టాక్
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share