‘అరవింద సమేత వీర‌రాఘ‌వ‌’ మూవీ రివ్యూ & రేటింగ్

October 10, 2018 at 8:30 pm

టైటిల్‌: అర‌వింద స‌మేత వీర‌రాఘ‌వ‌
బ్యాన‌ర్‌: హారిక & హాసిని క్రియేష‌న్స్‌
జాన‌ర్‌: ఫ‌్యామిలీ & యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌
న‌టీన‌టులు: ఎన్టీఆర్‌, పూజా హెగ్డే, ఈషా రెబ్బా, జ‌గ‌ప‌తిబాబు, నాగ‌బాబు, సునీల్ త‌దిత‌రులు
ఎడిటింగ్‌: న‌వీన్ నూలి
ఆర్ట్ వ‌ర్క్‌: ఏఎస్‌.ప్ర‌కాశ్‌
ఫైట్స్‌: రామ్ – ల‌క్ష్మ‌ణ్‌
సినిమాటోగ్ర‌ఫీ: పీఎస్‌.వినోద్‌
మ్యూజిక్‌: థ‌మ‌న్‌.ఎస్‌.ఎస్‌
స‌హ‌నిర్మాత‌: పీడీవీ.ప్ర‌సాద్‌
నిర్మాత‌: ఎస్‌.రాధాకృష్ణ (చిన‌బాబు)
ర‌చ‌న – ద‌ర్వ‌క‌త్వం: త‌్రివిక్ర‌మ్ శ్రీనివాస్‌
సెన్సార్ రిపోర్ట్‌: యూ / ఏ
ర‌న్ టైం: 161.30 నిమిషాలు ( 2.41.30 గంట‌లు )
రిలీజ్ డేట్‌: 11 అక్టోబ‌ర్‌, 2018

టాలీవుడ్ యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్ నాలుగు వ‌రుస హిట్ల‌తో మంచి జోరు మీదున్నాడు. టెంప‌ర్ – నాన్న‌కు ప్రేమ‌తో – జ‌న‌తా గ్యారేజ్ – జై ల‌వ‌కుశ సినిమాల హిట్ల‌తో దూసుకుపోతోన్న ఎన్టీఆర్ తాజా సినిమా అర‌వింద స‌మేత సినిమాతో ఈ రోజు ప్ర‌పంచ‌వ్యాప్తంగా ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తున్నాడు. ప‌దేళ్ల పాటు ఎన్టీఆర్ – త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్‌లో సినిమా కోసం యావ‌త్ టాలీవుడ్ అంతా ఆస‌క్తితో వెయిట్ చేస్తోంది. ప‌దేళ్ల పాటు ఊరించి..ఊరించిన వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో తెర‌కెక్కిన సినిమా కావ‌డంతో భారీ అంచ‌నాలు ఉన్నాయి. త్రివిక్ర‌మ్ చివ‌రి సినిమా అజ్ఞాత‌వాసి ఘోర‌మైన డిజాస్ట‌ర్ కావ‌డంతో త్రివిక్ర‌మ్ ఈ సినిమాను క‌సితో తెర‌కెక్కించిన‌ట్టు తెలుస్తోంది. త్రివిక్ర‌మ్ మార్క్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్కిన ఈ సినిమా ఈ రోజు ప్రపంచ‌వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వ‌చ్చింది. భారీ అంచ‌నాల‌తో వ‌చ్చిన ఈ సినిమా అంచ‌నాల‌ను అందుకుందా ? ఎన్టీఆర్‌కు వ‌రుస‌గా ఐదో హిట్ ఇచ్చిందా ? ఎన్టీఆర్ విశ్వ‌రూపం చూపించాడా ? త్రివిక్ర‌మ్ మాయాజాలం ప‌నిచేసిందా ? అన్న‌ది TJ స‌మీక్ష‌లో చూద్దాం.

43706432_1923791381047584_3272313085783703552_o

క‌థ & త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వం :
రాయలసీమలోని కొమ్మత్తి అనే ఊరులో యాక్షన్‌ నేపథ్యంలో ఈ కథ ప్రారంభం అవుతుంది. నారపురెడ్డి (నాగబాబు), బసిరెడ్డి(జగపతిబాబు), మధ్య ఏర్పడిన వైరంతో ఈ రెండు మథ్య చెలరేగిన ఫేక్షన్‌ గొడవల్లో చాలా మంది చనిపోతారు. ఈ గొడ‌వ‌ల్లోనే వీర‌రాఘ‌వ‌రెడ్డి (ఎన్టీఆర్‌) తండ్రి నార‌పురెడ్డి చనిపోగా… అదే టైంలో వీర‌రాఘ‌వుడు బ‌సిరెడ్డి గొంతులో క‌త్తి దింపి తీవ్రంగా గాయ‌ప‌రుస్తాడు. ఈ క్ర‌మంలోనే బ‌సిరెడ్డి, అత‌డి కొడుకు బాల్‌రెడ్డి (న‌వీన్‌చంద్ర) వీర‌రాఘ‌వ‌రెడ్డిని చంపి ప్ర‌తీకారం తీర్చుకోవాల‌నుకుంటుంటారు. ఈ ఫ్యాక్ష‌న్ గొడ‌వ‌లు ఆపి అక్క‌డ శాంతి నెల‌కొల్పాల‌ని చూసిన వీర‌రాఘ‌వుడికి ఎలాంటి అడ్డంకులు ఎదుర‌య్యాయి ? ఈ జ‌ర్నీలో అర‌వింద (పూజా హెగ్డే)తో అత‌డి ప్రేమాయ‌ణం ఎలా కొన‌సాగింది ? చివ‌ర‌కు వీర‌రాఘ‌వ తాను అనుకున్న ల‌క్ష్యం సాధించాడా ? అన్న‌దే క‌థ‌.

యుద్ధం వచ్చాక కాదు రాకముందు ఆపేవాడే గొప్పోడు అనే మెయిన్ లైన్‌ బేస్‌ చేసుకుని త్రివిక్రమ రాసుకున్న కథనం ఆదర్శవంతంగా ఉంది, ఆలోచింప చేసేలా ఉంది. త్రివిక్రమ్‌ మెయిన్‌ కథను బాగానే స్టాట్‌ చేసినా తొలి 20 నిమిషాలు గ్రిప్పింగా కథనం సాగినా ఆ తర్వాత కథ మరీ స్లో అయ్యిపోయింది. ఒకానొక దశలో ప్రేక్షకుడు సైతం కాస్త అసహనానికి ఫీల్‌ అయ్యే వరకూ వచ్చింది. అయితే అక్కడ నుంచి కథనం మళ్లీ ట్రాక్‌లోకి వచ్చింది. కథకుడిగా మంచి లైన్‌ తీసుకున్న త్రివిక్రమ్‌ దర్శకుడిగా కంటే రచయతగా మాత్రం సూపర్‌ సక్స్‌సెస్‌ అయ్యారు. పదునైన సంభాషణలు, ఆలోచింపచేసే మాటలు చాలా బాగున్నాయి. వాటిని ఎన్టీఆర్‌ పలికిన తీరు సూపర్‌. బసిరెడ్డి కొడుకు బాలరెడ్డితో ఎన్టీఆర్‌ గూడౌన్‌లో ఏర్పాటు చేసిన మీటింగ్‌లో అక్కడ వచ్చే యాక్షన్‌ సన్నివేశాలు పలికే డైలాగ్స్‌ సినిమాకే హైలెట్స్‌. ఇక కథే చాలా స్లోగా ఉంది… అనుకుంటే దీనికి తోడు నత్తనడక కథనం మాత్రం ఇబ్బంది కలిగిస్తుంది. ఓవ‌రాల్‌గా అజ్ఞాత‌వాసి ప్లాప్ త‌ర్వాత ఫామ్‌లోకి వ‌చ్చిన త్రివిక్ర‌మ్ మంచి హిట్ కొట్టాడు.

Do5cuerVAAATKu0

న‌టీన‌టుల పెర్పామెన్స్ :
ఎన్టీఆర్‌ సెటిల్డ్‌ పెర్పామెన్స్‌తో ఆకట్టుకున్నాడు. ఎన్టీఆర్‌ నటనకు ఎప్పుడూ వంక పెట్టలేము. తనకు అలవాటు అయిన శైలిలోనే భావోద్వేగ సన్నివేశాలు, రౌద్ర సన్నివేశాల్లో తిరుగు లేని పెర్పామెన్స్‌ చేశాడు. భావోద్వేగ, రౌద్ర సన్నివేశాల్లో ఎక్స్‌ప్రెషన్స్‌ సూపర్‌. హీరోయిన్‌ పూజా హెగ్డే పాత్రకు పెద్దగా స్కోప్‌ లేదు. పూజా ఉన్నంతో తన పాత్ర పరిధి మేరకు నటించింది. పూజా పాత్రను చాలా చోట్ల దర్శకుడు త్రివిక్రమ్‌ డీగ్లామర్‌గా చూపించారు. పూజా హెగ్డే చెల్లెలుగా నటించిన మరో హీరోయిన్‌ ఈషా రెబ్బా రెండు, మూడు సీన్లకు పరిమితం అవ్వడం మినహా చేసింది ఏమి లేదు. చాలా ఏళ్ల తర్వాత తిరిగి కమెడియన్‌గా ఎంట్రీ ఇచ్చిన సునీల్‌ కామెడీ కూడా మరీ పెద్ద టాప్‌గా లేదు. దర్శకుడు త్రివిక్రమ్‌ సునీల్‌ను పెద్దగా యూజ్‌ చేసుకోలేకపోయాడు. మెయిన్ విల‌న్‌గా చేసిన జ‌గ‌ప‌తిబాబు గ‌తంలో త‌న‌కు చేసిన‌ట్లుగానే త‌న‌కు అల‌వాటైన రీతిలో విల‌నిజం ప్ర‌ద‌ర్శించాడు. అయితే జ‌గ‌ప‌తిబాబు పాత్ర చాలా త‌క్కువ స‌న్నివేశాల‌కే ప‌రిమితం… విల‌నిజం యాక్ష‌న్‌లో ఎలివేట్ చేయ‌లేదు.

టెక్నిక‌ల్ డిపార్ట్‌మెంట్ ఎన‌లైజింగ్ :
టెక్నిక‌ల్ డిపార్ట్‌మెంట్‌లో అన్ని విభాగాలు త‌మ వ‌ర‌కు సినిమాకు న్యాయం చేశాయి. పీ.ఎస్‌.వినోద్‌ సినిమాటోగ్రఫీ జస్ట్‌ ఓకె. అన్ని క్లోజప్‌ షాట్లే కావడం, లాంగ్‌ షాట్లుకు ప్రాధాన్యం లేకపోవడంతో సినిమాటోగ్రాఫర్‌ పెద్దగా కష్టపడాల్సిన పని లేకుండా పోయింది. థమన్‌ పాటలు ఇప్పటకే జస్ట్‌ ఓకె. పాటలు ఎక్కువగా కథలో అంతర్భాగం అయ్యిపోవడంతో ఎన్టీఆర్ డ్యాన్సులు కొత్త‌గా చూసేందుకు స్కోప్‌ లేదు. భావోద్వేగ సన్నీవేశాల్లో మాత్రం థమన్‌ అందించిన నేపథ్య సంగీతం మనసులను హత్తుకునేలా ఉంది. నూలి నవీన్‌ ఎడిటింగ్‌ విషయానికి వస్తే ఫస్ట్‌ హాఫ్‌లో బోరింగా ఉన్నా సన్నివేశాలను ట్రిమ్‌ చెయ్యాల్సిందనిపిస్తుంది. 167 నిమిషాల రన్‌ టైమ్‌ ఉన్న సినిమాలో దాదాపు 17 నిమిషాలు ట్రిమ్‌ చేసి 150 నిమిషాల రన్‌ టైమ్‌ పిక్చర్స్‌ చేసినట్లు అయితే సినిమా స్పీడ్‌గా ముందు మూవ్‌ అయ్యేది. ఏఎస్‌.ప్రకాశ్‌ ఆర్ట్‌ వర్క్‌ గతంలో చూసిన సినిమాల తర్హాలోనే ఉంది. మరీ కొత్తగా ఏమి లేదు. రామ్‌- లక్ష్మణ్‌ ఫైట్లు పాతగానే ఉన్నా ఎన్నీఆర్‌ యాక్షన్‌ మాత్రం కొత్తగా ఉంది. నిర్మాత రాధాకృష్ణ నిర్మాణ విలువలు సినిమాకు తగినట్టుగా ఉన్నాయి.

ప్ల‌స్ పాయింట్స్ :
– సెకెండ్‌ హాఫ్‌
– ఎన్టీఆర్‌ సెటిల్డ్‌ పెర్పామెన్స్‌
– ఎమోష‌న‌ల్‌ డైలాగ్స్‌
– నేపథ్య సంగీతం
– మెయిన స్టోరీ లైన్‌
– ఇంట్ర‌వెల్ బ్యాంగ్‌
– భావోద్వేగాలు నిండిన క్లైమాక్స్‌

మైన‌స్ పాయింట్స్ :
– నెమ్మదైన కథనం
– ఫ‌స్టాఫ్‌లో వచ్చే కొన్ని బోరింగ్‌ సన్నివేశాలు
– ఎన్టీఆర్‌ వీర మాస్‌ అభిమానులు మెచ్చే అంశాలు లేకపోవడం
– కామెడీకి స్కోప్‌ లేకపోవడం
– హీరోయిన్ల పాత్ర‌కు ప్రాధాన్యం లేక‌పోవ‌డం

ఫైన‌ల్‌గా….
సీరియస్ ఫ్యాక్షన్ డ్రామా గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రంలో ఎన్టీఆర్ నటన , ఫ్యాక్షన్ నేపథ్యంలో వచ్చే యాక్షన్ ఎపిసోడ్లు చిత్రానికి హైలైట్. కామెడీ, మాస్ ప్రేక్ష‌కులు మెచ్చే అంశాలు కాస్త త‌క్కువుగా ఉండ‌డం మైనస్ అయ్యాయి. చివరగా ఈచిత్రం కమర్షియల్ అంశాలతో అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించేలా ఉంటుంది. ఈ పండగ సీజన్ లో ఫ్యామిలీతో కలిసి ఒక సారి ఈసినిమా చూడొచ్చు.

TJ సూచ‌న :
వీర‌రాఘ‌వ‌తో ఎమోష‌న‌ల్‌గా క‌నెక్ట్ అవ్వాల్సిందే

అర‌వింద స‌మేత వీర‌రాఘ‌వ‌ TJ రేటింగ్ : 3 / 5

‘అరవింద సమేత వీర‌రాఘ‌వ‌’ మూవీ రివ్యూ & రేటింగ్
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share