“అరవింద సమేత ” దెబ్బకు జాతకాలు తారుమారు!

October 11, 2018 at 5:20 pm

ఒక్క సినిమా హిట్ కొట్టిందీ అంటే ఆ సినిమా కోసం కష్టపడ్డవాళ్ల ఆనందానికి అవధులు ఉండవు. అది చిన్న సినిమా అయినా సరే…పెద్ద సినిమా అయినా సరే. ముఖ్యంగా స్టార్ హీరోల సినిమా వస్తుందటే..అభిమానులు..సినీ ప్రేక్షకులు ఎన్నో అంచనాలు పెట్టుకుంటారు. అంతే కాదు ఈ మద్య సోషల్ మీడియా వచ్చినప్పటి నుంచి దీనిపై మరింత ఫోకస్ పెట్టడం మొదలు పెట్టారు. కొంత మంది అయితే..సినిమా పోస్టర్లు, టీజర్ చూసి సినిమా జాతకం చెప్పేస్తున్నారు. ఇక ఇండస్ట్రీలో వారిద్దరి ప్రయాణం పది సంవత్సరాలు దాటినా..ఇద్దరికీ మంచి హిట్స్ వచ్చినా..కలిసి మాత్రం పనిచేయలేదు. వారే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, యంగ్ టైగర్ ఎన్టీఆర్.

మొత్తానికి జూనియర్ ఎన్టీఆర్-త్రివిక్రమ్ శ్రీనివాస్‌ల ఆసక్తికర కలయికలో తెరకెక్కిన ‘అరవింద సమేత’ ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సినిమా కోసం అభిమానులే కాదు.. సామాన్య ప్రేక్షకులు కూడా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఒక రకంగా చెప్పాలంటే..తెలుగులో చాలా నెలల తర్వాత ఒక భారీ సినిమా విడుదలకు సిద్ధమైందనే చెప్పాలి. ఈ నేపథ్యంలో ఈ సినిమాకు ఎలాంటి టాక్ వస్తుంది.. ఓపెనింగ్స్ ఎలా ఉంటాయి అన్న విషయంలో చిత్ర యూనిట్ ఉత్కంఠంగా ఉంది. ఇదిలా ఉంటే..అరవింద సమేత సినిమా కొంత మంది చాలా కీలకంగా మారింది.

టాలీవుడ్ లో సూపర్ హిట్ జోడీ అని పిలుచుకునే త్రివిక్రమ్ – పవన్ కళ్యాన్ కాంబినేషన్ లో వచ్చిన ‘అజ్ఞాతవాసి’ అట్టర్ ఫ్లాప్ అయ్యింది..దాంతో అసలు ఈ సినిమా త్రివిక్రమ్ తీశాడా అన్న డౌట్ వచ్చింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఎన్టీఆర్ తో తీస్తున్న ‘అరవింద సమేత’ఏమాత్రం డ్యామేజ్ అయినా..తన కెరీర్ కష్టాల్లో పడక తప్పదు. ఇక టెంపర్ చిత్రం నుంచి వరుస విజయాలు అందుకుంటున్న ఎన్టీఆర్ అంత పెద్ద దర్శకుడి సినిమా ఏ మాత్రం ఫ్లాప్ టాక్ తెచ్చుకున్న తర్వాత నటించబోయే సినిమాలపై ఎఫెక్ట్ ఖచ్చితంగా ఉంటుంది.

నిర్మాత రాధాకృష్ణ పరిస్థితీ అంతే. ఇక తెలుగులో ఇప్పటిదాకా హిట్టు ముఖమే చూడని హీరోయిన్ పూజా హెగ్డే.. ‘అరవింద సమేత’ తన రాత మారుస్తుందని ఆశిస్తోంది. కొంత కాలంగా సరైన హిట్ లేక నానా ఇబ్బందులు పడుతున్న తమన్ పరిస్థితి కూడా అంతే..మరి వీరందరి ఆశలు ఎంత వరకు నెరవేరుస్తుందో..రేపటితో తెలిసిపోతుందని సినీ విశ్లేషకులు అంటున్నారు.

“అరవింద సమేత ” దెబ్బకు జాతకాలు తారుమారు!
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share