‘ అర్జున్‌రెడ్డి ‘ ఫ‌స్ట్ షేర్‌: తొలి రోజుకే లాభాలు..

టాలీవుడ్‌లో ప్రేక్ష‌కుల అభిరుచి పూర్తిగా మారిపోయింది. స్టార్ డ‌మ్‌, స్టార్ కాస్టింగ్‌, స్టార్ ద‌ర్శ‌క‌నిర్మాత‌ల సినిమాలు అంటే ఒక‌ప్పుడు అదిరిపోయే క్రేజ్ ఉండేది. అయితే ఇప్పుడు స్టార్ డ‌మ్‌, స్టార్ హీరోలు అని ఎవ్వ‌రూ చూడ‌డం లేదు. క‌థాబ‌లం ఉండ‌డంతో పాటు త‌మ‌కు న‌చ్చే సినిమాల‌నే ప్రేక్ష‌కులు ఆద‌రిస్తున్నారు. అంతే కాదు చిన్న సినిమా అయినా స‌రే అదిరిపోయే ఓపెనింగ్స్ ఇస్తున్నారు.

ఇందుకు విజ‌య్ దేవ‌ర‌కొండ తాజా చిత్రం అర్జున్‌రెడ్డి చిత్ర‌మే పెద్ద ఉదాహ‌ర‌ణ‌. పెళ్లిచూపులు సినిమాతో ఓవ‌ర్‌నైట్ స్టార్ అయిపోయిన విజ‌య్ న‌టించిన లేటెస్ట్ మూవీ అర్జున్‌రెడ్డి. వివాదాల‌తో రిలీజ్‌కు ముందు మంచి హైప్ తెచ్చుకున్న ఈ సినిమాకు పెద్ద హీరో సినిమాలా ప్రీమియ‌ర్ షోలు ప్లాన్ చేశారు.

అటు ఓవ‌ర్సీస్‌లో 85 చోట్ల ప్రీమియ‌ర్ షోలు వేయగా, ఇటు రెండు తెలుగు రాష్ట్రాల్లోను గురువారం సెకండ్ షోకే ప్రీమియ్లు ప‌డ్డాయి. పెయిడ్ ప్రీమియ‌ర్ షోలు అంటూ నిర్మాతలు ఈ సినిమా కోసం అమ‌లు చేసిన ప్లాన్ స‌క్సెస్ అయ్యి భారీ వ‌సూళ్లు రావ‌డానికి కార‌ణ‌మైంది.

ఈ సినిమా ఫ‌స్ట్ డేకే భారీ లాభాల్లోకి వ‌చ్చేసింది. రూ 3.2 కోట్ల‌తో తెర‌కెక్కిన ఈ సినిమాను సునీల్ నారంగ్ రూ. 5 కోట్ల‌కు కొన్నారు. అయితే కేవ‌లం ఫ‌స్ట్ డేకే రూ.8 కోట్ల గ్రాస్ వ‌సూళ్లతో పాటు 4.5 కోట్ల షేర్ రాబ‌ట్టింది. అర్జున్‌రెడ్డి ఫ‌స్ట్ డే ఏరియా వైజ్ షేర్ ఇలా ఉంది.

నైజాం – 1.40 కోట్లు

సీడెడ్ – 35లక్షలు

నెల్లూరు – 6 లక్షలు

గుంటూరు – 21 లక్షలు

కృష్ణా – 25 లక్షలు

వెస్ట్ -10 లక్షలు

ఈస్ట్ – 19 లక్షలు

ఉత్త‌రాంధ్ర – 21 లక్షలు

ఓవర్సీస్ – 1.8 కోట్లు

———————————————-

ఫ‌స్ట్ డే వ‌ర‌ల్డ్ వైడ్ షేర్ = 4.5 కోట్లు