లేటెస్ట్స్ అప్ డేట్స్ ..ఇక “అవతార్-2” లేదు

November 9, 2018 at 11:43 am

సాధారణంగా హీలీవుడ్ సినిమాలు అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మితమవుతుంటాయి. అయితే దానికి తగ్గట్టుగానే వసూళ్లు కూడా రాబడుతుంటాయి. హాలీవుడ్ స్టార్ డైరెక్టర్ జేమ్స్‌ కెమెరూన్‌ దర్శకత్వం వహించిన సినిమాలు ప్రపంచ స్థాయిలో ఉర్రూతలూగించాయి. అస్కార్ అవార్డులు గెల్చుకున్నాయి. మనిషి ఊహలకు అద్దం పట్టే విధంగా కెమెరూన్ సినిమాలు ఉంటాయి. జేమ్స్‌ కెమెరూన్‌ దర్శకత్వం వహించిన ‘అవతార్‌’సినీ ప్రేమికులను మంత్ర ముగ్దులను చేసింది. అసలు భూమిపై ఇలాంటి జీవాలు ఉంటాయా..అనే విధంగా ఊహలకందని రీతిలో సినిమా తెరకెక్కించారు. అప్పట్లో ఈ సినిమా బాక్సాఫీస్ షేక్ చేయడమే కాదు ప్రపంచవ్యాప్తంగా 2.8బిలియన్‌ డాలర్ల కలెక్షన్లను వసూలు చేసింది.avatar

ఇప్పుడు ఈ సినిమాకి సీక్వెల్స్‌ తెరకెక్కించే పనిలో ఉన్నారు జేమ్స్‌ కెమెరూన్‌. అయితే ఈ సినిమాలకు ‘అవతార్‌2’, ‘అవతార్‌3’ ‘అవతార్‌4’, ‘అవతార్‌5’పేర్లు అసలైనవి కాదట. ఈ విషయంలో బీబీసీ కొన్ని సంచలన విషయాలు వెల్లడించింది. ‘అవతార్ ’కి సీక్వెల్ గా వచ్చే సినిమాలు.. ‘అవతార్‌: ది వే ఆఫ్‌ వాటర్‌’, మూడో భాగానికి ‘అవతార్‌: ది సీడ్‌ బేయరిర్‌, నాలుగో భాగానికి ‘అవతార్‌: ది టల్కన్‌ రైడర్‌, ఐదో భాగానికి ‘అవతార్‌: ది క్వస్ట్‌ ఫర్‌ ఈవా’ అనే టైటిల్‌ పెడుతున్నారని సమాచారం.

Avatar (2009) Zoe Saldana and Sam Worthington

Avatar (2009)
Zoe Saldana and Sam Worthington

కాకపోతే ఈ విషయంపై దర్శకులు కానీ చిత్ర యూనిట్ కానీ ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. కాగా, సీక్వెల్‌గా వస్తున్న ‘అవతార్‌2’ కథ ఎక్కువగా నీటి అడుగున సాగుతుందట. ప్రముఖ హాలీవుడ్‌ నటి కేట్‌ విన్స్‌లెట్‌ సముద్రతీర ప్రాంత వాసులకు నాయకురాలిగా కనిపించనుంది. అవతార్‌లో డాక్టర్‌ గ్రేస్‌ అగస్టీన్‌ పాత్ర పోషించిన సిగోర్నే వీవర్‌ ఇటీవల మాట్లాడుతూ.. ‘అవతార్‌2, 3 చిత్రాల షూటింగ్‌ ఇప్పటికే పూర్తి చేశాం. ‘అవతార్‌ 2’,‘అవతార్‌ 3’సినిమాలు డిసెంబర్‌ 18, 2020.. డిసెంబర్‌ 17, 2021న రిలీజ్ కాబోతున్నాయట. ఇక ‘అవతార్‌ 4’, ‘అవతార్‌ 5’ సినిమాలు డిసెంబర్‌ 20, 2024, డిసెంబర్‌ 19, 2025లో ఆ సినిమాలు రిలీజ్ చేయబోతున్నట్లు దర్శకులు కామెరూన్‌ ప్రకటించారు.

లేటెస్ట్స్ అప్ డేట్స్ ..ఇక “అవతార్-2” లేదు
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share