బాల‌య్య వ‌ర్సెస్ నాగ్‌… మ‌రో సాక్ష్యం

June 28, 2018 at 9:29 am
balayya-nag

టాలీవుడ్ లో నందమూరి బాలకృష్ణ అంటే ఎంత క్రేజ్ ఉంటుందో అందరికీ తెలిసిందే.  ప్రస్తుతం వివివినాయక్ దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్న బాలయ్య తర్వాత బోయపాటి దర్శకత్వంలో మరో సినిమాలో నటించబోతున్నాడు.  ఆ తర్వాత తన తండ్రి ఎస్టీఆర్ బయోపిక్ సినిమాలో నటించబోతున్నారు.  ఈ సినిమాకు క్రిష్ దర్శకత్వం వహిస్తున్నారు.  అయితే ఇండస్ట్రీలో బాలకృష్ణ కు అందరు హీరోలతో సాన్నిహిత్యం బాగానే ఉంటుందని అంటారు..కాకపోతే అక్కినేని ఫ్యామిలీ హీరోలతో మాత్రం ఎక్కువగా కలిసి ఉన్న దాఖలాలు లేవు. 

 

బాల‌కృష్ణ – నాగార్జున మ‌ధ్య ఉన్న సంబంధాలు అంతంత‌మాత్ర‌మే అని ఫిల్మ్ న‌గ‌ర్ జ‌నాలు ఎప్పుడూ చెప్పుకుంటూనే ఉంటారు.  ఓ అవార్డు ఫంక్ష‌న్లో ఇద్ద‌రి మ‌ధ్య మ‌న‌స్ప‌ర్థ‌లు వ‌చ్చాయ‌ని, అవి నేటికీ కొన‌సాగుతూనే ఉన్నాయ‌ని ఓ టాక్ వినిపిస్తూ ఉంటుంది. ఈ విషయంపై ఒకసారి నాగార్జున మాట్లాడుతూ..అబ్బే బాలయ్యతో తనకు ఎలాంటి విభేదాలు లేవని అన్నారు.  కానీ ఒక్కసారి సారి వచ్చిన గాసిప్పులు వస్తే..అవి అంత సులభంగా మర్చిపోరు. 

 

 ఈ వాద‌న‌కు మ‌రింత బ‌లాన్ని చేకూర్చున ఓ విష‌యం జ‌రిగింది. `ఎన్టీఆర్‌` బ‌యోపిక్‌తో బాల‌య్య బిజీగా ఉన్న సంగ‌తి తెలిసిందే.ఈ సినిమాలో స్టార్ల‌ని తీసుకొచ్చి.. కొత్త క‌ళ తీసుకురావాల‌ని ఆయ‌న గ‌ట్టిగా ప్ర‌య‌త్నిస్తున్నారు. అందులో భాగంగా ఏఎన్నార్ పాత్ర కోసం బాల‌య్య నాగార్జున‌ని సంప్ర‌దించార‌ని స‌మాచారం. కానీ నాగ్ మాత్రం సున్నితంగా `నో` చెప్పార‌ని టాక్‌. 

 

నిజంగా బాల‌య్య‌తో నాగ్‌కి ఎలాంటి గొడ‌వా లేక‌పోతే.. ఈ పాత్ర‌కు ఎందుకు `నో` చెబుతార‌న్న‌ది టాలీవుడ్ వర్గాల్లో రక రకాల చర్చలు కొనసాగుతున్నాయి.  కాకపోతే నాగార్జున నో చెప్పినా..ఆ పాత్ర నాగ‌చైత‌న్య ద‌గ్గ‌ర‌కు వెళ్లింద‌ని, ఇప్పుడు నాగ‌చైత‌న్య కూడా ఏఎఎన్నార్ పాత్ర చేయ‌డానికి సిద్ధంగా లేడ‌ని, చైతూ స్థానంలో సుమంత్‌ని తీసుకుంటారని వార్తలు వస్తున్నాయి. 

బాల‌య్య వ‌ర్సెస్ నాగ్‌… మ‌రో సాక్ష్యం
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share