బాలయ్యపై కాలు దువ్వుతున్న పెట్ట!

October 5, 2018 at 11:31 am

భారతీయ చలన చిత్ర రంగంలో సూపర్ స్టార్ రజినీకాంత్ అంటే ఎంత క్రేజ్ ఉంటుందో అందరికీ తెలిసిందే. ఒకప్పుడు ఆయన స్టైల్ చూసి ఫిదా అయిన వారు కోట్ల మంది ఉన్నారు. అయితే ఈ మద్య రజినీకాంత్ ఎక్కువ శాతం ప్రయోగాత్మక పాత్రలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. ముఖ్యంగా మాఫియా తరహా పాత్రల్లో నటిస్తున్నారు. కబాలి, కాలా చిత్రాలు సూపర్ స్టార్ తన కెరీర్ లో ప్రయోగాలనే చెప్పొచ్చు. సిగరెట్ గాల్లో ఎగరేసి పెదవి అంచుతో అందుకుని ఆ రోజుల్లోనే ప్రయోగాల హీరోగా రికార్డులకెక్కారు.

కాలర్ మడత పెట్టి మాస్ అవతార్ని ఆవిష్కరించినా.. ఆటోవాలా చొక్కా తొడుక్కుని కార్మికుడిగా కనిపించినా – చంద్రముఖిలో లకలకలక అంటూ కొత్త ఆహార్యం ప్రదర్శించినా…ఎలాంటి ప్రయోగలు చేసినా మాస్ ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయ్యేవారు రజినీకాంత్. కబాలి, కాలా సినిమాల్లో పండిన తలకట్టు – మీసం- గడ్డంతో మాస్ అవతార్ లో కనిపించి ఎనర్జిటిక్ పెర్ఫామెన్స్ తో సర్ ప్రైజ్ చేశారు. ఏది ఏమైనా 60 యేళ్లు దాటిన రజినీకాంత్ తన వయసుకు తగ్గ పాత్రల్లో నటించి ఆడియన్స్ ని మెప్పిస్తున్నారనడంలో అతిశయోక్తి లేదు.

మరి అందరూ రజినీని అలాగే చూడాలని అనుకోరు..అలాగే కనిపిస్తే కూడా బోరింగ్ ఫీల్ అవుతారని రజినీ ఇప్పుడు లుక్ మార్చారు. ఈరోజు ఒక కొత్త లుక్ ని `పెట్టా` టీమ్ రిలీజ్ చేసింది. మునుపటితో పోలిస్తే .. రజనీ మరోసారి తన పాత క్లాసిక్ రోజుల్ని గుర్తు చేసినట్టయ్యింది. మరోసారి ముత్తు – అరుణాచలం గెటప్కి మారిపోయారు. నుదిటిన నామంబొట్టు.. ఆపై కుంకుమ బొట్టు.. సిల్కు బ్రాండు తెల్లచొక్కా తో నిజంగా తమిళ తంబీలా కనిపిస్తున్నాడు. petta-759

అప్పట్లో చంద్రముఖి సినిమాలో ఎలా యంగ్ గా కనిపించాడో..ఇప్పుడు కూడా అదే లుక్ లో కనిపించడం ఆయనకే చెల్లింది. పెట్టా హారర్ కాన్సెప్ట్ మూవీ. పిజ్జా ఫేం కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వం వహిస్తున్నాడు. వారణాసిలో ప్రస్తుతం చిత్రీకరణ సాగుతోంది. 2019 సంక్రాంతికి బాలయ్య `ఎన్టీఆర్` సినిమాకి పోటీగా ‘పెట్టా’ సినిమా రిలీజ్ చేయడానికి సిద్దంగా ఉన్నారట.

బాలయ్యపై కాలు దువ్వుతున్న పెట్ట!
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share