బాల‌య్యను వదిలేది లేదంటున్న వ‌ర్మ‌

September 20, 2017 at 8:13 am
Balakrishna, Ramgopal Varma, NTR Biopic

విశ్వ‌విఖ్యాత న‌టుడు సీనియ‌ర్ ఎన్టీఆర్ జీవితంపై సినిమా తీస్తున్నాన‌ని సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశాడు వివాదాల‌కు కేరాఫ్ అడ్రస్ అయిన‌ రామ్‌గోపాల్ వ‌ర్మ‌! ఈ సినిమా గురించి ఏ చిన్న విష‌యం బయ‌ట‌కు తెలిసినా అది సంచ‌ల‌న‌మే! ఇప్ప‌టి నుంచే ఈ సినిమాకు బోల్డంత హైప్ క్రియేట్ చేసేస్తున్నాడు వ‌ర్మ‌! దీనిని ల‌క్ష్మీపార్వ‌తి కోణం నుంచి తీస్తాన‌ని మ‌రో బాంబు పేల్చాడు. మ‌రి ఎన్టీఆర్ కుటుంబం బ‌యట‌కు రాకుండా ఇన్నాళ్లు గుట్టుగా ఉంచిన వాటిని తెర‌పైకి తీసుకొస్తాన‌ని చెప్ప‌డం వెనుక‌.. వ‌ర్మ స్ట్రాట‌జీ వేరే ఉందా? అంటే అవున‌నే స‌మాధాన‌మే వినిపిస్తోంది. ఎన్టీఆర్ త‌న‌యుడు, ఎమ్మెల్యే బాల‌య్యను వ‌ర్మ టార్గెట్ చేసేందుకు వేసిన స్కెచ్ అని అభిప్రాయ‌ప‌డుతున్నారు.

ఏ రూట్‌లో వెళితే త‌న‌కు కావాల్సిన ప‌బ్లిసిటీ వ‌స్తుందో రామ్‌గోపాల్ వ‌ర్మ‌కు తెలిసినంత‌గా మ‌రే దర్శ‌కుడికీ తెలియ‌దు! ఎవ‌రితో ఎలా మైండ్ గేమ్ ఆడాలో కూడా ఆయ‌న‌కు వెన్న‌తో పెట్టిన విద్య‌! ఇప్పుడే ఇదే ఫార్ములాని బాల‌కృష్ణ మీద కూడా ప్ర‌యోగిస్తున్నాడేమో అనే సందేహాలు అంద‌రిలోనూ వ‌స్తున్నాయి. ఎందుకంటే ఎన్టీఆర్ సినిమా తీస్తాన‌ని అందులో ఎన్టీఆర్ పాత్ర తానుచేయ‌బోతున్నాన‌ని బాల‌కృష్ణ ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే! ఇది జ‌రిగిన కొన్ని రోజుల‌కు.. ఎన్టీఆర్ సినిమాకు సంబంధించి ఒక సాంగ్‌ను విడుద‌ల చేశారు రామ్‌గోపాల్‌వ‌ర్మ‌! అంతేగాక తాను ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న‌ట్లు సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు.

అయితే వర్మ ఇలా తనని సంప్రదించకుండా తన అనుమతి లేకుండా ఏకపక్షంగా తానే దర్శకత్వం వహించబోతు న్నట్లు గా ప్రకటించ‌డం బాలకృష్ణకి ఎంతమాత్రము నచ్చలేదు. దానికి తగ్గట్లు గానే ఆ తర్వాత ఈ సినిమా గురించి ఫైనలైజ్ చేసుకోవడానికి రాంగోపాల్ వర్మ పదే – పదే బాలకృష్ణని కలవడానికి ప్రయత్నించినప్పటికి అపాయింట్మెంట్ కూడా దొరకలేదని పరిశ్రమలో గుస గుసలు వినిపిస్తూ వచ్చాయి. ఎన్టీఆర్ జీవిత కథ చిత్రానికి తాను దర్శకత్వం వహించే అవకాశం కల్పించనందుకు.. బాలకృష్ణ మీద ఒత్తిడి తెచ్చి అటు నుంచి నరుక్కుని రావాల‌ని వ‌ర్మ ప్ర‌య‌త్నిస్తున్నారు ఇందులో భాగంగా `లక్ష్మి ఎన్టీఆర్` అనే చిత్రం చేయబోతున్నట్టుగా సంచలన ప్రకటన చేశారు.

చంద్రబాబు వెన్నుపోటు వ్యవహారం నుంచి ఆ తర్వాతి జీవితం లో ఎన్టీఆర్‌ అనుభవించిన పరిస్థి తులు ప్రధాన కథాంశంగా రామ్ గోపాల్ వర్మ చిత్రం ఉంటుందని ల‌క్ష్మీపార్వ‌తి కూడా తెలిపారు. అంటే ఎన్టీఆర్ జీవితంలో బాహ్య ప్రపంచంలోకి రాకూడని నందమూరి కుటుంబ సభ్యులు కోరుకుంటారో ఆ అంశాలనే ప్రధాన కథాంశంగా రాంగోపాల్ వర్మ సంకేతాలు ఇస్తున్నాడు. ఈ చిత్రం బయటకు రాకుండా ఉండాలంటే బాలకృష్ణ తాను ప్లాన్ చేస్తున్న ఎన్టీఆర్ జీవిత కథ చిత్రానికి వర్మ కి దర్శకత్వ ఛాన్స్ ఇస్తే సరిపోతుంది కదా అని అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. మరి వ‌ర్మ‌ ఒత్తిడికి బాల‌య్య లొంగుతాడో లేదో వేచిచూడాల్సిందే!!

 

బాల‌య్యను వదిలేది లేదంటున్న వ‌ర్మ‌
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts


Share
Share