బిగ్ బాస్‌-2 ఇంట్ర‌స్టింగ్ న్యూస్ వ‌చ్చేసింది

November 18, 2017 at 10:19 am
ntr-TJ

ఎన్టీఆర్ హోస్ట్‌గా చేసిన తెలుగు బిగ్ బాస్ షో తెలుగు బుల్లితెర మీద ఎన్నో సంచ‌ల‌నాలు క్రియేట్ చేసింది. ఇలాంటి షో తెలుగు ప్రేక్ష‌కుల‌కు ఎంత వ‌ర‌కు క‌నెక్ట్ అవుతుంద‌న్న సందేహాల‌ను ప‌టాపంచ‌లు చేసింది ఈ షో. ఇందుకు ఎన్టీఆర్ ఈ షోను హోస్ట్ చేయ‌డ‌మే అనేది ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ఎన్టీఆర్ హోస్ట్‌గా అటు విమ‌ర్శ‌కుల‌తో పాటు ఇటు బుల్లితెర ప్రేక్ష‌కుల‌ను కూడా త‌న ఎన‌ర్జీతో మెస్మ‌రైజ్ చేశాడు. 

ఈ షో దెబ్బ‌కు చాలా సంవ‌త్స‌రాల త‌ర్వాత షో ప్రారంభ‌మైన వారం రోజుల‌కే మా టీవీ నెంబ‌ర్ వ‌న్ రేటింగ్‌లోకి వ‌చ్చేసింది. ఎనిమిది వారాల పాటు వీకెండ్‌లో తెలుగు ప్రేక్ష‌కుల‌ను బుల్లితెర‌మీద ప‌ల‌క‌రించిన మ‌న తార‌క్ మ‌ళ్లీ వీకెండ్‌లో తెలుగు బుల్లితెర ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించేందుకు రెడీ అయిపోతున్నాడు. తాజాగా జై ల‌వ‌కుశ లాంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ సినిమా స‌క్సెస్ ఎంజాయ్ చేస్తోన్న త‌న నెక్ట్స్ సినిమాను మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ ద‌ర్శ‌క‌త్వంలో న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే.

ఈ సినిమా షూటింగ్‌కు చాలా టైం ఉండ‌డంతో స్టార్ మా బిగ్ బాస్ తెలుగు సీజ‌న్ -2ను ప్రారంభించేందుకు స‌న్నాహాలు చేస్తోంది. వాస్త‌వంగా ఎన్టీఆర్ సీజ‌న్ 1లో ఓ వైపు జై ల‌వ‌కుశ సినిమా షూటింగ్‌లో మూడు పాత్ర‌లు చేస్తూ హోస్టింగ్ చేశాడు. మ‌రి ఇప్పుడు ఫుల్ టైం ఫ్రీగా ఉన్నాడు. దీంతో మ‌రింత ఎన‌ర్జీతో సీజ‌న్ 2 వీకెండ్‌ను ర‌చ్చ చేయ‌డం ఖాయం. ఫిబ్ర‌వ‌రిలో ఎన్టీఆర్ – త్రివిక్ర‌మ్ సినిమా సెట్స్‌మీద‌కు వెళ్ల‌నుంది. ఇక ఈ లోపుగా బిగ్ బాస్ సీజ‌న్ -2 షూటింగ్‌ను ఎన్టీఆర్ చాలా వ‌ర‌కు కంప్లీట్ చేసేలా స్టార్ మా ప్లాన్ చేస్తోంది.

బిగ్ బాస్‌-2 ఇంట్ర‌స్టింగ్ న్యూస్ వ‌చ్చేసింది
0 votes, 0.00 avg. rating (0% score)


Share
Share