తెలుగు బిగ్ బాస్‌-2కు హోస్ట్‌గా ఆ స్టార్ హీరో ఫిక్స్‌

బుల్లితెర మీద బిగ్ బాస్ షో ఇప్పుడు పెద్ద సెన్సేషన్. ఎక్క‌డో నెదర్లాండ్స్‌లో ప్రారంభ‌మైన ఈ షో ఇప్పుడు ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఏకంగా 60 దేశాల్లోని వివిధ భాష‌ల్లో ప్ర‌సార‌మ‌వుతోంది. ఇప్ప‌టికే హిందీ బిగ్ బాస్ షో 11 ఎపిసోడ్ ర‌న్ అవుతుండ‌గా, తెలుగు, త‌మిళ్‌లో మాత్రం ఫ‌స్ట్ ఎపిసోడ్ జ‌రుగుతోంది. ఈ షోకు తెలుగు ప్రేక్ష‌కుల‌కు చాలా కొత్త‌. అయితే ఈ షోకు ప్రేక్ష‌కుల్లో అదిరిపోయే క్రేజ్ తీసుకు వ‌చ్చేందుకు స్టార్ మా ఛానెల్ యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్‌ను హోస్ట్‌గా పెట్టుకుని స‌క్సెస్ అయ్యింది.

హోస్ట్‌గా ఎన్టీఆర్‌కు ఎంత‌ క్రేజ్ ఉన్నా కంటెస్టెంట్స్ కూడా కాస్తో కూస్తో క్రేజ్ వున్నవాళ్లు అయితే బావుండేది. కానీ షోలో కంటెస్టెంట్స్‌తో మాత్రం తెలుగు బుల్లితెర ప్రేక్ష‌కులు చాలా బోర్ ఫీల‌వుతున్నారు. ప్రారంభంలో ఈ షోకు టీఆర్పీ రేటింగ్స్ బాగానే ఉన్నా త‌ర్వాత మాత్రం బాగా డ్రాప్ అయిపోయాయి. వీకెండ్లో ఎన్టీఆర్ వ‌చ్చిన‌ప్పుడు మాత్రం మిన‌హా మిగిలిన రోజుల్లో రేటింగ్ రావ‌డం లేదు.

ఇక మ‌రో 20 రోజుల్లో బిగ్ బాస్ సీజ‌న్ 1 ముగుస్తోంది. అయితే సీజ‌న్ 2లో మాత్రం సీజ‌న్ 1లో జ‌రిగిన త‌ప్పులు పున‌రావృతం చేయ‌కూడ‌ద‌ని ఎన్టీఆర్ నిర్వాహ‌కుల‌కు చెప్పార‌ట‌. ఇక మ‌రో ట్విస్ట్ ఏంటంటే సీజ‌న్ 2కు కూడా ఎన్టీఆర్‌నే హోస్ట్‌గా స్టార్ మా ఫిక్స్ చేసేసింద‌ట‌.

ఈ క్ర‌మంలోనే సీజ‌న్ 1ను మించేలా సీజ‌న్ 2 కోసం ఆరేడుగురు స్ట్రాంగ్ కంటెస్టెంట్ల‌ను తీసుకోవాల‌ని ఎన్టీఆర్ సూచించ‌డంతో ఇప్పుడు నిర్వాహ‌కులు కూడా మాంచి ఎట్రాక్ష‌న్ ఉన్న స్ట్రాంగ్ కంటెస్టెంట్ల కోసం భారీ రెమ్యున‌రేష‌న్ కూడా ఇవ్వాల‌ని డిసైడ్ అయ్యార‌ని తెలుస్తోంది. మరి సీజ‌న్‌లో 2లో ఎలాంటి కంటెస్టెంట్లు ఉంటారో ? చూడాలి.