బోయపాటి టార్గెట్ గా “మెగా” ఆపరేషన్

February 11, 2019 at 4:31 pm

సంక్రాంతి కానుక‌గా విడుద‌ల అయిన ఎన్టీఆర్ క‌థానాయ‌కుడు సినిమా రిక‌వ‌రీ 29శాతం మాత్ర‌మే. ఇక ఇదే పండుగ సంద‌ర్భంగా విడుద‌ల అయిన సినిమా విన‌య విధేయ రామ సినిమా రిక‌వ‌రీ 70శాతం. ఇక గ‌తంలో వ‌చ్చిన ప‌వ‌న్ క‌ళ్యాణ్ సినిమా అజ్ఞాత వాసి సినిమా రిక‌వ‌రీ 50శాతం కంటే త‌క్కువ‌గా ఉంద‌ని అంటారు. కానీ.. వీట‌న్నింటిలో కంటే ఎంతో బెట‌ర్ రిక‌వ‌రీ శాతం ఉన్న విన‌య విధేయ రామ సినిమా ద‌ర్శ‌కుడు బోయ‌పాటి శ్రీ‌నుపై మాత్రం ట్రోలింగ్ ఆగ‌డం లేదు. ఆయ‌న‌పై సోష‌ల్ మీడియా వేదిక‌గా దాడి కొన‌సాగుతూనే ఉంది.62570915

టాలీవుడ్‌లో బెట‌ర్ ట్రాక్ రికార్డు ఉన్న డైరెక్ట‌ర్ల‌లో బోయ‌పాటి అగ్ర‌స్థానంలో ఉంటారు. మ‌రి విన‌య విధేయ రామ సినిమా విష‌యంలో మాత్రం ఎందుకిలా జ‌రుగుతుంద‌న్న‌ది మాత్రం ఎవ్వ‌రికీ అంతుబ‌ట్ట‌డం లేదు. నిర్మాత దాన‌య్య‌, హీరో రాంచ‌ర‌ణ్‌లు కావాల‌నే బోయ‌పాటిని టార్గెట్ చేస్తున్నార‌నే టాక్ బ‌లంగా వినిపిస్తోంది. ప్రెస్‌నోట్‌లో అంద‌రికీ క‌`త‌జ్ఞ‌త‌లు తెలిపిన రాంచ‌ర‌ణ్ బోయ‌పాటిని మాత్రం మ‌రిచిపోయాడు. ఇక సినిమా ఎంత‌ఖ‌ర్చు అయ్యిందో లెక్క‌చెప్ప‌కుండానే, ఎలాంటి సంప్ర‌దింపులు జ‌ర‌ప‌కుండానే బ‌య్య‌ర్ల‌కు ప‌రిహారం చెల్లింపుపై వీరు ప్ర‌తిపాద‌న చేయ‌డం.. ఇలా ఏక‌ప‌క్ష నిర్ణ‌యాల‌ను బ‌ట్టి టార్గెట్ బోయ‌పాటిగా ఆప‌రేష‌న్ జ‌రుగుతుంద‌నే టాక్ వినిపిస్తోంది.Boyapati-Srinu-Ram-Charan

ఇక ఇదే స‌మ‌యంలో త‌క్కువ రిక‌వ‌రీ ఉన్న ఎన్టీఆర్ క‌థానాయ‌కుడు ద‌ర్శ‌కుడు క్రిష్‌పై మాత్రం ఎలాంటి కామెంట్స్ లేవు. ఎలాంటి ట్రోలింగ్ లేదు. కేవ‌లం దాన‌య్య‌, రాంచ‌ర‌ణ్‌తో బోయ‌పాటికి మ‌న‌స్ప‌ర్థ‌లు వ‌చ్చిన త‌ర్వాతే ఫ్యాన్స్ ట్రోలింగ్ స్టార్ట్ చేసిన‌ట్లు తెలుస్తోంది. ఇది ముందు ముందు ఇండ‌స్ట్రీలో దుష్ప‌రిణామాల‌కు దారితీస్తుంద‌నే వాద‌న కూడా వినిపిస్తోంది. ఇలాంటి వాటిని ఎవ‌రు కూడా ప్రోత్స‌హించ‌వ‌ద్ద‌ని ప‌లువురు విశ్లేష‌కులు సూచిస్తున్నారు. ముందుముందు ఏం జ‌రుగుతుందో చూడాలి మ‌రి.

బోయపాటి టార్గెట్ గా “మెగా” ఆపరేషన్
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share