ఘోర కారు ప్రమాదం … తప్పించుకున్న టాలీవుడ్ హీరోయిన్

July 12, 2018 at 3:08 pm
pjimage copy

అల్లరి నరేష్ నటించిన సుడిగాడు మంచి విజయం సాధించిన విషయం తెలిసిందే.  ఈ సినిమాలో అల్లరి నరేష్ జంటగా అందాల భామ మోనాల్ గుజ్జర్ నటించిన విషయం తెలిసిందే.  ఆ తర్వాత బ్రదర్ ఆఫ్ బొమ్మాళి సినిమాలో కూడా నరేష్ పక్కన నటించింది.  తాజాగా మోనాల్ గుజ్జర్  గుజ్జార్ భారీ ప్రమాదం నుంచి తప్పించుకుంది.  మోనాల్ తన స్నేహితుడు డాక్టర్ రోహిత్ పుట్టిన రోజు వేడుక కోసం కుటుంబసభ్యులు స్నేహితులతో కలిసి అహ్మదాబాద్ నుంచి ఉదయ్ పూర్ వెళ్లారు. 

 

అనంతరం తిరిగి వస్తుండగా ఉదయ్ పూర్ హైవేపై వారు ప్రయాణిస్తున్న కారు ఆదివారం ప్రమాదానికి గురైంది.  అయితే కారు ప్రమాదం తీవ్ర స్థాయిలో జరిగినట్లు కారు ను చూస్తే అర్ధం అవుతుంది. ఆ ప్రమాదంలో ఎవరూ బతికే ఛాన్స్ లేదు.  దాంతో  కారు ప్రమాదంలో మోనాల్ గుజ్జార్ మరణించినట్లు వార్తలు వచ్చాయి.  దీంతో బుధవారం మోనాల్ ఫేస్ బుక్ లైవ్ లోకి వచ్చారు. తాను మరణించానని కొన్ని మీడియాల్లో వస్తున్న వార్తలను ఖండించారు. తనతో పాటు కుటుంబసభ్యులు స్నేహితులు ఈ ప్రమాదం నుంచి క్షేమంగా బయటపడ్డారని పేర్కొన్నారు.

Sudigadu-Movie-Hot-Photos-1221

 

  ప్రమాద సమయంలో తాను సీట్ బెల్ట్ పెట్టుకున్నానని చిన్న గాయాలు మాత్రమే అయ్యాయని పోస్ట్ లో తెలిపింది. మోనాల్ చివరగా గుజరాతీ చిత్రం ‘రేవా’లో నటించారు. ప్రస్తుతం ఆమె గుజరాతీ చిత్రం ‘ఫ్యామిలీ సర్కస్ ’ లో నటిస్తున్నారు. తెలుగుతో పాటు గుజరాతీ హిందీ తమిళ్ మలయాళ చిత్రాల్లో మోనాల్ నటించారు.

Monal-Gajjar-Images-2 

ఘోర కారు ప్రమాదం … తప్పించుకున్న టాలీవుడ్ హీరోయిన్
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts


Share
Share