రెండోసారి చిరుతో కలిసి స్టెప్పులు

February 4, 2019 at 10:36 am

ఖైదీ నంబ‌ర్ 150 త‌ర్వాత మెగాస్టార్ చిరంజీవి న‌టిస్తున్న ప్ర‌తిష్టాత్మ‌క చిత్రం సైరా… ప్రముఖ స్వాతంత్ర్య స‌మ‌రయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆదారంగా ఈ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్ కొనిద‌ల ప్రొడ‌క్ష‌న్ బ్యానర్ పై అత్యంత భారీ బ‌డ్జెట్ తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు సురేంద‌ర్‌ రెడ్డి దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ‘సైరా నరసింహారెడ్డి’ చిత్రం దాదాపు షూటింగ్ పూర్తి చేసుకున్న‌ట్లు ఇండ‌స్ట్రీ వ‌ర్గాలు పేర్కొంటున్నాయి.

ఇప్ప‌టికే ఈ చిత్రంపై అటు ప్రేక్షకుల్లో , ఇటు ప‌రిశ్ర‌మ‌లో భారీ అంచనాలున్నాయి. రెండు సంవ‌త్స‌రాల విరామం త‌ర్వాత న‌టిస్తున్న చిత్రం కావ‌డంతో మెగాస్టార్ చిరంజీవి అభిమానులు ఈ సినిమా కోసం ఎంతో ఆత్రుత‌గా ఎదురు చూస్తున్నారు. ఇటీవ‌లే విదేశాల్లో క్లైమాక్స్‌కు సంబంధించిన కీల‌క పోరాట ఘ‌ట్టాల‌ను చిత్రీక‌రించారు. సమ్మర్‌కి షూటింగ్ మొత్తం పూర్తి చేసుకుంటుందని చిత్ర యూనిట్ టాక్.

దసరాకు ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో బిగ్‌బీ అమితాబ్ బచ్చన్, నయనతార, జగపతిబాబు, బ్రహ్మాజీ, విజయ్ సేతుపతి తదితరులు కీలక పాత్రల్లో నటించనున్నారు. అయితే ఈ చిత్రంలో బిగ్ సర్‌ప్రైజ్ ఉండనుందని సమాచారం. ‘సైరా’లో గెస్ట్ రోల్‌లో అనుష్క నటిస్తోందని ఇండ‌స్ట్రీలో గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఆమెను ఈ విషయమై రామ్ చరణ్ సంప్రదించాడని ఆవ‌ర్గాలు పేర్కొంటున్నాయి. గతంలో చిరంజీవి నటించిన ‘స్టాలిన్’ సినిమాలో కూడా అనుష్క స్పెషల్ సాంగ్‌లో కనిపించింది. ఇక ‘సైరా’లో త‌ళుక్కుమ‌ని మెగా అభిమానుల‌ను రెండో సారి అల‌రించ‌నుంది.

రెండోసారి చిరుతో కలిసి స్టెప్పులు
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share