సురేష్ బాబు కారు ప్రమాదం … తీవ్ర గాయాలు

October 22, 2018 at 12:19 pm

ఈ మద్య కాలంలో తెలుగు రాష్ట్రాల్లో రోడ్డు ప్రమాదాల శాతం ఎక్కువే అవుతుంది. రిసెంట్ గా నంతమూరి హరికృష్ణ కారు నల్లగొండ జిల్లా అన్నేపర్తి వద్ద రోడ్డు ప్రమాదానికి గురైంది..అక్కడే కామినేని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ..కన్నుమూశారు. అయితే రోడ్డు భద్రతా చర్యలు ఎన్ని తీసుకుంటున్నా..డ్రంక్ అండ్ డ్రైవ్ లో ఎన్నిసార్లు కౌన్సిలింగ్ ఇస్తున్నా..కొంత మంది నిర్లక్ష్యంగా డ్రైవింత్ చేస్తూ..తమకు తాము నష్టం కలిగించుకోవడమే కాకుండా ఎదుటి వారికి కూడా నష్టాన్ని..కష్టాన్ని కలిగిస్తున్నారు. తాజాగా ప్రముఖ ప్రముఖ సినీ నిర్మాత దగ్గుబాటి సురేష్‌ బాబు కారు బీభత్సం సృష్టించింది.car

రాంగ్‌రూట్‌లో దూసుకెళ్లిన కారు ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టిన ఘటనలో ద్విచక్రవాహనంపై వెళ్తున్న వారికి తీవ్ర గాయాలయ్యాయి. కారు వేగంగా ఢీకొట్టడంతో బైక్‌పై వెళ్తున్న దంపతులు, వారి మూడేళ్ల చిన్నారి కిందపడిపోయారు. ప్రమాదంలో తీవ్ర గాయాల పాలైన వారిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని ఘటన జరిగిన తీరును పరిశీలించారు.

కాగా, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… కార్ఖానా పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని ఇంపీరియల్‌ గార్డెన్‌ వద్ద రాంగ్‌ రూట్‌లో దూసుకెళ్లిన సురేష్‌బాబుకు చెందిన టీఎస్‌09ఈఎక్స్‌2668 నెంబరు కారు అటువైపు వస్తున్న ద్విచక్ర వాహనాన్ని ఢీ కొన్నడంతో..ఆ ద్విచక్రవాహనంపై వెళుతున్న దంపతులు సతీష్‌ చంద్ర(35), దుర్గ దేవి(30), సిద్దేశ్‌ చంద్ర(3)లు గాయపడ్డారు. గాయపడ్డ వారిని వెంటనే యశోద ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన వెంటనే సురేష్ బాబు వేరే వాహనంలో అక్కడ నుంచి వెళ్లిపోయినట్లు సమాచారం. ఇదిలా ఉంటే..ప్రమాదానికి కారణమైన సురేష్ బాబుకు 41ఏ నోటీసులు ఇచ్చిన కార్ఖానా పోలీసులు.. ఐపీసీ 337 కింద కేసు నమోదు చేశారు.

సురేష్ బాబు కారు ప్రమాదం … తీవ్ర గాయాలు
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share