దేవరకొండ ముద్దుల వ‌ర్షం ..”డియ‌ర్ కామ్రేడ్‌” టీజర్

March 17, 2019 at 12:46 pm
3333333333333

టాలీవుడ్ స‌న్సేష‌న‌ల్ స్టార్ హీరో విజయ్‌ దేవరకొండ, రష్మిక మందన జంటగా నటించిన చిత్రం ‘డియర్‌ కామ్రేడ్‌’. భరత్‌ కమ్మా ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. విజ‌య్ దేవ‌ర‌కొండ‌ వ‌రుస సినిమాల‌తో దుమ్మురేపుతున్నాడు. అర్జున్‌రెడ్డి, గీత‌గోవిందం, టాక్సీవాలా సినిమాల‌తో ఆయ‌న ఇమేజ్ అమాంతంగా పెరిగిపోయింది. తాజాగా.. డియ‌ర్ కామ్రేడ్ సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తున్నాడు. తాజాగా ఈ చిత్ర టీజర్‌ను ఆదివారం విడుదల చేశారు.

‘కడలల్లె వేచె కనులే..’ అన్న పాటతో విజయ్‌ దేవరకొండ ఫైటింగ్‌ సన్నివేశాలతో డియ‌ర్ కామ్రేడ్‌ టీజర్‌ మొదలైంది. ఇక‌ వర్షంలో విజయ్‌, రష్మిక ముద్దుపెట్టుకుంటున్నసీన్‌తో టీజర్‌ ముగిసింది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో సినిమాను విడుదల చేయబోతున్నారు. ‘గీత గోవిందం’ తర్వాత విజయ్‌, రష్మిక జంటగా నటించిన ఈ చిత్రంలో వీరిద్ద‌రి మ‌ధ్య వ‌చ్చిన ముద్దు సీన్‌తో సినిమాపై అంచ‌నాలు మ‌రింత‌గా పెరిగిపోవ‌డం ఖాయంగానే క‌నిపిస్తోంది.

టీజ‌ర్‌లో ఒక్క‌టే ముద్దు సీన్ క‌నిపించినా.. ఇంకా వీరిద్ద‌రి మ‌ధ్య సినిమాలో ఎన్ని ముద్దులు ఉంటాయోమ‌రి. కాగా, మైత్రి మూవీ మేకర్స్, బిగ్ బెన్ బ్యానర్స్ సంస్థలు సంయుక్తంగా డియ‌ర్ కామ్రేడ్‌ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ప్రముఖ తమిళ మ్యూజిక్ డైరెక్టర్ జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందించారు. మే 31న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

దేవరకొండ ముద్దుల వ‌ర్షం ..”డియ‌ర్ కామ్రేడ్‌” టీజర్
0 votes, 0.00 avg. rating (0% score)

comments



Related Posts


Share
Share