దుమ్మురేపతున్న కార్తీ ‘దేవ్’టీజర్!

November 5, 2018 at 1:23 pm

తమిళ స్టార్ హీరో సూర్య తమ్ముడు కార్తీ తెలుగు ప్రేక్షకులకు మంచి పరిచయమే..కార్తీ నటించిన సినిమాలు తెలుగు లో కూడా డబ్ అవుతుంటాయి. ఆ మద్య నాగార్జున, కార్తి మల్టీస్టారర్ సినిమా అద్భుత విజయం సాధించింది. తర్వాత ఖాకీ, చినబాబు కూడా మంచి విజయాలు అందుకున్నాయి. చినబాబు సినిమా తర్వాత కార్తి నటిస్తోన్న సినిమా ‘దేవ్’. రజత్‌ రవి శంకర్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో కార్తీ స‌ర‌స‌న ర‌కుల్ ప్రీత్ సింగ్, నిక్కీ గల్రానీ క‌థానాయిక‌లుగా న‌టిస్తున్నారు. ఖాకీ సినిమా తర్వాత కార్తీ, రకుల్ ప్రీత్ సింగ్ కాంబినేషన్ లో వస్తోన్న రెండో సినిమా ఇది. ప్రకాష్‌రాజ్‌, రమ్యకృష్ణ కీల‌క పాత్ర‌లు పోషిస్తున్న ఈ సినిమాకి హ‌రీష్ జ‌య‌రాజ్ సంగీతం అందిస్తున్నారు.77777

‘దేవ్ ’ సినిమాతో మాస్‌, యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌తో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్దమయ్యాడు కార్తి. కొద్ది సేపటి క్రితం ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేశారు. ప్రిన్స్‌ పిక్చర్స్‌ బ్యానర్‌ పై ఎస్ లక్ష్మణ్ కుమార్ నిర్మిస్తున్న ఈ సినిమా తెలుగు హక్కులను ప్రముఖ నిర్మాత ఠాగూర్ మధు దక్కించుకోగా, రిలయన్స్ ఎంటర్ టైన్మెంట్ సమర్పణలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

‘ఎవరో చెప్పారని అర్థం కాని చదువు చదివి..ఇష్టం లేని ఉద్యోగం చేసి..ముక్కు మొఖం తెలియని నలుగురు మెచ్చుకోవాలని కష్టపడి పనిచేసి..గొప్ప కాంపిటీషన్ లో ఇరుక్కొని..అంటీ అంటనట్లు లవ్ చేసి..ఏం జరుగుతుంతో అర్థం కాకుండా బతకడానికి ఓ దారి ఉంది..ఇంకో దారి ఉంది..’అంటూ కార్తి కొట్టే డైలాగ్..తో టీజర్ మొదలవుతుంది. నన్నొదిలేస్తే..ఆ అమ్మాయిని తీసుకొని పోతూ ఉంటా..వదలకపోతే అన్న డైలాగ్ కి వదలకపోయినా తీసుకు పోతా..ఏ సీనా అన్నదానికి కాన్ఫిడెన్స్ అంటూ కార్తీ డైలాగ్స్ తో ముగుస్తుంది. తన అభిమాన క్రికెటర్‌ కపిల్‌దేవ్‌ స్ఫూర్తితోనే ఈ సినిమాకు ‘దేవ్‌’ టైటిల్‌ను దర్శకుడు రజత్‌ రవి శంకర్ ఖ‌రారు చేసిన సంగ‌తి తెలిసిందే.

దుమ్మురేపతున్న కార్తీ ‘దేవ్’టీజర్!
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share