వివేక్ రెమ్యూనరేషన్ చూసి షాక్ తిన్న ‘దేవదాసు’టీమ్!

August 11, 2018 at 11:38 am

బాలీవుడ్ లో సురేష్ ఒబెరాయ్ తనయుడు వివేక్ ఒబెరాయ్ ఈ మద్య హీరోగా కన్నా విలన్ గానే ఎక్కువ మెప్పిస్తున్నాడు. తెలుగు లో రక్త చరిత్ర సీరీస్ తో పరిచయం అయిన వివేక్ ఒబెరాయ్ పలు సినిమాల్లో విలన్ గా నటించాడు. ఆ మద్య అజిత్ నటించిన వివేగం సినిమాలో కూడా విలన్ గా నటించాడు. రాం గోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన హిట్ సినిమా కంపెనీ(2002) తో తెరంగేట్రం చేశారు వివేక్.dvda-fr-ps-tj

ఈ సినిమాలోని ఆయన నటనకు ఫిలింఫేర్ ఉత్తమ నూతన నటుడు, ఉత్తమ సహాయ నటుడు పురస్కారాలను అందుకున్నారు. తాజాగా తాజాగా వివేక్ ఓబ్రాయ్ తెలుగు తెరపై నెగిటివ్ రోల్స్ చేసేందుకు సిధ్దమవుతున్నాడని తెలుస్తోంది. ప్రస్తుతం బోయపాటి – రాంచరణ్ కాంబినేషన్ లో వస్తున్న భారీ యాక్షన్ సినిమాలో వివేక్ ఒబెరాయ్ విలన్ గా నటించబోతున్నట్లు వార్తలు వచ్చాయి. ఇదిలా ఉంటే నాగార్జున, నానిల మల్టీస్టారర్ సినిమా నిర్మాతలు విలన్ పాత్రకోసం వివేక్ ఒబెరాయ్ ని కలిశారట..కానీ మనోడు రెమ్యూనరేషన్ విని షాక్ తిన్నారట.Vivek-Oberoi-to-play-villain-in-Ram-Charans-next-005

నాగార్జున, నాని లాంటి స్టార్ హీరోల సినిమాలో విలన్ అంటే భారీ స్థాయిలో ఉంటుందని భావించిన మనోడు తన రెమ్యూనరేష్ కూడా రెండింతలు చేశాడట. ఈ సినిమా కోసం ఏకంగా రూ.2.5 కోట్లు అడిగినట్లు సమాచారం. దాంతో నిర్మాతలు అంత రెమ్యూనరేషన్ అంటే కష్టం అని భావించి వేరే విలన్ కోసం చూస్తున్నట్లు సమాచారం.

వివేక్ రెమ్యూనరేషన్ చూసి షాక్ తిన్న ‘దేవదాసు’టీమ్!
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share