‘ జై ల‌వ‌కుశ‌ ‘ పై దేవిశ్రీ రివ్యూ

September 20, 2017 at 4:45 pm
Jai Lava Kusa, NTR, Devisri Prasad

ప్ర‌స్తుతం టాలీవుడ్‌ను జై ల‌వ‌కుశ ఫీవ‌ర్ ఓ ఊపు ఊపుతోంది. గురువారం ఈ సినిమా రిలీజ్ అవుతుండ‌గా బుధ‌వారం అర్ధ‌రాత్రి నుంచే థియేట‌ర్ల వ‌ద్ద ఎన్టీఆర్ ఫ్యాన్స్ పండ‌గ చేసుకుంటున్నారు. కెరీర్‌లోనే ఫ‌స్ట్ టైం ట్రిబుల్ రోల్ చేస్తోన్న ఎన్టీఆర్ ఈ సినిమాలో జై, లవ, కుశగా మూడు విభిన్నమైన పాత్రల్లో ఎన్టీఆర్‌ అలరించబోతున్నాడు. ఈ సినిమాకు జై పాత్రే కీల‌కం కానుంది. జై పాత్ర రావణుడి ఛాయలతో సాగుతోంది. నాటకాలు అధికంగా ఇష్టపడే జై.. రావణుడిలా ప్రతినాయకుడి పాత్రలో కనిపించనున్నారు.

ఎన్టీఆర్ కెరీర్‌లో ఫ‌స్ట్ టైం ట్రిబుల్ రోల్ పోషించ‌డంతో పాటు తొలిసారి ప్రతినాయ‌కుడిగా నటిస్తుండ‌డంతో సినిమాపై ఉన్న హైప్ ఒక్క‌సారిగా స్కైను ట‌చ్ చేసింది. ఇప్ప‌టికే దుబాయ్ ఇండియ‌న్ సినిమాల సెన్సార్ బోర్డ్ మెంబ‌ర్‌, ఫిల్మీ క్రిటిక్ ఉమైర్ సంధు సినిమా ఎన్టీఆర్ కెరీర్‌లో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అని చెప్ప‌డంతో పాటు జై ల‌వ‌కుశ‌కు 3.5 రేటింగ్ ఇచ్చారు.

ఉమైర్ రివ్యూతో ఇప్పటికే తారస్థాయి అంచనాలు ఉన్న ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగేలా మ్యూజిక్‌ డైరెక్టర్‌ దేవీశ్రీ ప్రసాద్‌ ట్వీట్‌ చేశారు. ‘జైలవకుశ’ సినిమాను డైరెక్టర్‌ బాబీ అద్భుతంగా తెరకెక్కించారని, యంగ్‌టైగర్‌ ఎన్టీర్‌ మైండ్‌బ్లోయింగ్‌ పర్ఫార్మెన్స్‌తో అదరగొట్టాడని దేవీ ట్వీట్‌ చేశాడు. రావణా అంటూ ‘జై’ పాత్రలో ఎన్టీఆర్‌ అదరగొట్టినట్టు హింట్‌ ఇచ్చారు. సెల‌బ్రిటీలు అంద‌రూ సినిమాపై పాజిటివ్‌గా స్పందించ‌డం చూస్తుంటే జై ల‌వ‌కుశ ఎన్టీఆర్ కెరీర్‌లో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌గా నిల‌వ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది.

 

‘ జై ల‌వ‌కుశ‌ ‘ పై దేవిశ్రీ రివ్యూ
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts


Share
Share