ఒక దెబ్బకే దిల్ రాజు వాషౌట్!

August 18, 2018 at 4:03 pm

నిర్మాతగా ఎన్ని హిట్ సినిమాలు వచ్చినా..కొన్ని సినిమాల ఫ్లాపులతో ఎలాంటి వారైనా ఖంగుతింటారు. ఎన్నో ఆశలు పెట్టుకొని భారీ స్థాయిలో ప్రమోషన్ చేసి సినిమా రిలీజ్ చేస్తే అది కాస్త ఫ్లాప్ టాక్ వస్తే..ఆ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ల బాధ వర్ణనాతీతం. టాలీవుడ్ లో అగ్ర నిర్మాత దిల్ రాజు ఆ మద్య రాజ్ తరుణ్ తో సొంత బ్యానర్ లో తీసిన లవర్ బాక్సాఫీస్ వద్ద బొక్కబోర్లా పడింది. పదిహేనేళ్ల తర్వాత హీరో నితిన్ తో ‘శ్రీనివాస కళ్యానం’సినిమా తెరకెక్కించారు.Dil_Raju

ఒకప్పడు శతమానం భవతి లాంటి బ్లాక్ బస్టర్ అందించిన దర్శకుడు విఘ్నేష సతీష్ దర్శకత్వంలో వచ్చిన ‘శ్రీనివాస కళ్యాణం’ వివాహబంధంపై అద్భుతంగా తెరకెక్కించారు. కానీ ఆ సెంటిమెంట్ యూత్ కి మాత్రం ఎక్కలేదు. నెగెటివ్ రివ్యూలు వచ్చినా.. టాక్ డివైడ్గా ఉన్నా.. వసూళ్లు కూడా ఆశించిన స్థాయిలో లేకపోయినా రాజు ఆశలు వదులుకోలేదు. సక్సెస్ మీట్ పెట్టి సినిమాను కాస్త ముందుకు తీసుకు వెళ్లడానికి ప్రయత్నించారు..అయన అంచనాలు అందుకుంటూ..ని, ఆదివారాల్లో కొంచెం పుంజుకున్నట్లు కనిపించింది. Srinivasa-Kalyanam-Movie-Latest-Posters--Working-Stills7

కానీ ఒక్కసారే గూఢచారి రూపంలో నిరుత్సాహపరిచియింది..ఇది సరిపోలేదని ఇప్పుడు ‘గీతా గోవిందం’ఎఫెక్ట్ పడింది. ప్రస్తుతం మార్కెట్ లో గీతాగోవిందం జోరు నడుస్తుంది. ఒకదశలో ఈ సినిమా 50 కోట్ల మార్క్ దాటుతుందని సినీ విశ్లేషకులు అంటున్నారు. ఇక క ‘శ్రీనివాస కళ్యాణం’ ఫుల్ రన్ షేర్ రూ.12 కోట్లకు అటు ఇటు ఆగిపోయేలా కనిపిస్తోంది. మొత్తానికి దిల్ రాజుకు ‘శ్రీనివాస కళ్యాణం’తో బాగా నష్టాలు చవిచూడాల్సి వచ్చేలా ఉంది.

ఒక దెబ్బకే దిల్ రాజు వాషౌట్!
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share