మెగా ఫ్యాన్స్ కు దసరా గిఫ్ట్ ఇదే!

October 17, 2018 at 3:56 pm

మెగా హీరో రాంచరణ్ ఈ సంవత్సరం ‘రంగస్థలం’ లాంటి బ్లాక్ బస్టర్ విజయంతో మంచి ఉత్సాహంతో ఉన్నాడు. `రంగస్థలం` చిత్రంతో `నాన్ బాహుబలి` రికార్డులు అందుకున్న రామ్చరణ్ .. ఆ తర్వాత వెంటనే మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. టాలీవుడ్ ఇండస్ట్రీలో మాస్ దర్శకుడిగా బోయపాటికి ఎంత క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే. ఆ మద్య అల్లు అర్జున్ తో తీసిన ‘సరైనోడు’బ్లాక్ బస్టర్ విజయం అందుకుంది. ఈ నేపథ్యంలో రాంచరణ్ కి కూడా ఆ రేంజ్ లో మంచి హిట్ ఇవ్వాలని చూస్తున్నాడు బోయపాటి. ఉన్నాడు. ప్రస్తుతం ఆర్సి 12 శరవేగంగా పూర్తవుతోంది. ఈ సినిమాకి `వినయ విధేయ రామా` అనే టైటిల్ని ఫిక్స్ చేశారన్న టాక్ వినిపిస్తోంది. ఈ మద్య సినిమాలకు టైటిల్స్ చాలా వెరైటీగా పెడుతున్నారు.Boyapati-Srinu-Ram-Charan

రీసెంట్ గా వచ్చిన త్రివిక్రమ్ – ఎన్టీఆర్ మూవికి ‘అరవింత సమేత వీర రాఘవ’మొదట్లో అర్థం కాకున్నా సినిమా చూశాక అర్దం అయ్యింది. కాకపోతే చెర్రీ సినిమాకు సంబంధించి ఎలాంటి అప్ డేట్ ఇప్పటి వరకు రాలేదు. తాజా సమాచారం ప్రకారం.. ఆర్సి 12 టైటిల్ ఫస్ట్లుక్ లాంచ్ కి టీమ్ సన్నాహాలు చేస్తోందని సమాచారం. ఇదివరకూ అజర్ భైజాన్ (యూరప్) షెడ్యూల్లో భారీ యాక్షన్ ఎపిసోడ్స్ తెరకెక్కించారు. ఈ దసరా కానుకగా ఈనెల 19న ఫస్ట్ లుక్ని లాంచ్ చేస్టారని టాక్ వినిపిస్తుంది. ఈ సినిమా షూటింగ్ మొదలు పెట్టి కూడా చాలా రోజులు కావడంతో సంక్రాంతి బరిలో దించేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టారట. కాకపోతే ఇప్పటి వరకు ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ కూడా రాలేదు..అందుకే ప్రమోషన్ వర్క్ పై కూసింత ఎక్కువే శ్రద్ద పెట్టబోతున్నట్లు సమాచారం.

సంక్రాంతి బరిలో చెర్రీ ఠఫ్ కాంపిటీషన్ని ఎదుర్కోనున్నాడు. నందమూరి బాలకృష్ణ నటిస్తున్న `ఎన్టీఆర్- కథానాయకుడు` విక్టరీ వెంకటేష్- వరుణ్ తేజ్ హీరోలుగా నటిస్తున్న `ఎఫ్ 2` అజిత్ విశ్వాసం చిత్రాలు సంక్రాంతి బరిలో రిలీజ్ కానున్నాయి. మరి సినిమాకు మంచి హిట్ టాక్ వస్తే..కానీ ఆ కాంపిటీషన్ తట్లుకోలేరు. పైగా కాంపిటీటర్తో పోలిస్తే తన సినిమాకి ప్రచారం కూడా సరిగా లేదు. అందుకే వచ్చే నెల నుంచి అన్ని షరవేగంగా జరపాలని టీమ్ బావిస్తుందట. ఈ చిత్రంలో కియారా అడ్వాణీ కథానాయికగా నటిస్తోంది. డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై దానయ్య నిర్మిస్తున్నారు. నవంబరు ఆఖరుకి చిత్రీకరణ పూర్తవుతుందని సమాచారం

మెగా ఫ్యాన్స్ కు దసరా గిఫ్ట్ ఇదే!
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share