వెంకీ,వరుణ్ “ఎఫ్‌ 2 (ఫన్‌ అండ్‌ ఫ్రస్ట్రేషన్‌) ” సినిమా రివ్యూ…

January 12, 2019 at 2:30 pm

టైటిల్ : ఎఫ్‌ 2 (ఫన్‌ అండ్‌ ఫ్రస్ట్రేషన్‌)
బ్యానర్ : కామెడీ ఎంటర్‌టైనర్‌
న‌టీన‌టులు : వెంకటేష్‌, వరుణ్‌ తేజ్‌, తమన్నా, మెహరీన్‌, రాజేంద్ర ప్రసాద్‌, ప్రకాష్‌ రాజ్‌
సంగీతం : దేవీ శ్రీ ప్రసాద్‌
దర్శకత్వం : అనిల్‌ రావిపూడి
నిర్మాత : దిల్‌ రాజు

వెంక‌టేశ్‌, వ‌రుణ్‌తేజ్ మ‌ల్టీస్టార‌ర్‌గా న‌టించిన చిత్రం ఎఫ్ 2. హీరోయిన్లు త‌మ‌న్నా, మెహ‌రీన్‌. ద‌ర్శ‌కుడు అనిల్ రావిపూడి. చాలాకాలం త‌ర్వాత వెంక‌టేశ్ కామెడీ చిత్రంలో న‌టించాడు. అందులోనూ వ‌రుణ్‌లాంటి యంగ్ హీరోతో క‌లిసి మ‌ల్టీస్టార‌ర్ సినిమాలో న‌టించాడు. దీంతో ఈ సినిమాపై మొద‌టి నుంచీ భారీ అంచ‌నాలే ఉన్నాయి. సంక్రాంతి కానుక‌గా ఈ సినిమా శ‌నివారం విడుద‌ల అయింది. ఇప్ప‌టికే ఎన్టీఆర్ క‌థానాయ‌కుడు, విన‌య‌విధేయ రామ లాంటి భారీ సినిమాలు విడుద‌ల అయ్యి.. భిన్న‌మైన టాక్‌ను తెచ్చుకున్నాయి. ఈక్ర‌మంలోనే విడుద‌ల అయిన ఎఫ్ 2లో వెంకీ, వ‌రుణ్ కామెడీ ప్రేక్ష‌కుల‌ను ఏమేర‌కు ఆక‌ట్టుకుంది..? అనిల్ రావిపూడి మ‌ళ్లీ స‌క్సెస్ అయ్యాడో లేదో తెలుసుకుందాం.

క‌థేమిటంటే..

ఎమ్మెల్యే(ర‌ఘు బాబు) వ‌ద్ద వెంకీ(వెంక‌టేశ్ ) పీఏగా పనిచేస్తుంటాడు. వ‌రుణ్‌యాద‌వ్‌(వ‌రుణ్‌) హైద‌రాబాద్ బ‌స్తీ కుర్రోడు. హారిక‌( త‌మ‌న్నా), హ‌నీ( మెహ‌రీన్‌) అంద‌మైన అక్కాచెల్లెలు. ఒంట‌రిగా లైఫ్‌ను వెంకీ ఎంతో ఎంజాయ్ చేస్తుంటాడు. అయితే త‌మ‌న్నాను వెంకీ పెళ్లి చేసుకున్న త‌ర్వాత ఆయ‌న జీవితం పూర్తి భిన్నంగా మారిపోతుంది. అత్తామామాల తీరుతో ఫ్ర‌స్ట్రేష‌న్‌కు గుర‌వుతుంటాడు. వారితో వేగ‌లేక తీవ్ర నిరూత్సాహంలో కూరుకుపోతుంటాడు. ఇక ఇదే స‌మ‌యంలో మెహ‌రీన్‌తో వ‌రుణ్‌కు ప‌రిచ‌యం ఏర్ప‌డుతుంది. ఆమెను పెళ్లి చేసుకోవాల‌ని ప్ర‌య‌త్నం చేస్తుంటాడు. అయితే.. ఈ విష‌యం తెలుసుకుని వెంకీ వ‌రుణ్‌ను వ‌ద్ద‌ని వారిస్తుంటాడు. ఈలోపే వ‌రుణ్ జీవితం పూర్తి మెహ‌రీన్‌లో చేతుల్లోకి వెళ్తుంది. ఇక అప్ప‌టి నుంచి వెంకీ, వ‌రుణ్‌లు వారితో వేగ‌లేక రాజేంద్ర‌ప్ర‌సాద్ ఇచ్చిన స‌ల‌హాతో యూర‌ప్ ట్రిప్‌కు వెళ్లిపోతారు. త‌మ‌న్నా, మెహ‌రీన్‌లు త‌మ మాట వింటార‌ని భావిస్తారు. ఇక ఆ త‌ర్వాత ఏం జ‌రిగింద‌న్నది మాత్రం తెర‌పైనే చూడాలి.

ఎవ‌రెలా చేశారంటే..

ఈ సినిమాకు వెంకీ న‌ట‌న హైలెట్‌గా నిలుస్తుంది. త‌న‌దైన హాస్యంతో వెంకీ అల‌రించాడు. అయితే.. తెలంగాణ యాస‌లో మాట్లాడేందుకు వ‌రుణ్ మాత్రం కొంత ఇబ్బంది ప‌డ్డాడు. త‌మ‌న్నా, మెహ‌రీన్‌లు మాత్రం త‌మ‌త‌మ పాత్ర‌ల‌కు న్యాయం చేశారు. ప్ర‌కాశ్‌రాజ్‌, రాజేంద్ర‌ప్ర‌సాద్ త‌దిత‌ర న‌టులు ప‌ర‌వాలేద‌ని అనిపించాడు. ఇక దేవిశ్రీ‌ప్ర‌సాద్ అందించిన సంగీతం మాత్రం పెద్ద‌గా ఆక‌ట్టులేక‌పోయింది. స్ర్కీన్‌ప్లే త‌దిత‌ర సాంకేతిక అంశాలు మాత్రం బాగా కుదిరాయి. అయితే… మొద‌టి భాగంలో పండిన హాస్యం రెండో భాగంలో అంత‌గా కుద‌ర‌లేదు. ఈ క్ర‌మంలో ప్రేక్ష‌కులు కొంత నిరూత్సాహానికి గుర‌వుతారు. మొత్తంగ చెప్పుకోవాలంటే.. కామెడీ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌తో మ‌ల్టీస్టార‌ర్‌గా రూపొందించిన అనిల్ రావిపూడి దాదాపుగా మంచి సక్సెస్ సాధించాడ‌ని చెప్పుకోవ‌చ్చు..

చివ‌రిగా.. వెంకీ కుమ్మేశాడు

రేటింగ్ : 3.0/5

వెంకీ,వరుణ్ “ఎఫ్‌ 2 (ఫన్‌ అండ్‌ ఫ్రస్ట్రేషన్‌) ” సినిమా రివ్యూ…
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share