సంక్రాంతి వ‌సూళ్ల‌లో దూసుకెళ్తున్న “ఎఫ్ 2 “

January 15, 2019 at 11:58 am

సంక్రాంతి కానుక‌గా విడుద‌ల అయిన ఎఫ్ 2 సినిమా విజ‌యవంతంగా ర‌న్ అవుతోంది. రోజురోజుకూ బాక్సాఫీస్ వ‌ద్ద త‌న స‌త్తాచాటుతోంది. క్ర‌మంగా వ‌సూళ్లు పెరుగుతున్నాయి. మొద‌టి రోజు రాబ‌ట్టిన క‌లెక్ష‌న్లను మూడో రోజు క‌లెక్ష‌న్లు బీట్ చేశాయి. ఈ వ‌సూళ్లను బ‌ట్టే చెప్పుకోవ‌చ్చు.. ఎఫ్ 2 బాక్సాఫీస్‌ను ఎలా షేక్ చేస్తుందో. వెంకీ మార్క్ కామెడీ, యంగ్ హీరో వ‌రుణ్‌తేజ్ న‌ట‌న‌, త‌మ‌న్నా, మెహ‌రీన్ గ్లామ‌ర్‌.. అంతా క‌లిపి చిత్రం ప్రేక్ష‌కుల‌ను అమితంగా ఆక‌ట్టుకుంటోంది.

తెలుగు రాష్ట్రాల్లో ఎఫ్ 2 మూడో రోజు క‌లెక్ష‌న్లు డిస్ట్రిబ్యూట‌ర్ షేర్‌తో క‌లిపి మొత్తం రూ.5.05కోట్లు రాబ‌ట్టింది. మొద‌టి రోజు క‌లెక్ష‌న్లు రూ.4.30కోట్ల‌ను మూడోరోజు బీట్ చేసింది. ఇక నాలుగో రోజు సంక్రాంతి, క‌నుమ నాడు వ‌సూళ్లు ఇంకా పెరిగే అవ‌కాశాలు ఉన్నాయ‌ని ట్రేడ్‌వ‌ర్గాలు అంచ‌నా వేస్తున్నాయి. మొత్తంగా మూడు రోజుల్లో రూ. 14.21కోట్లు రాబ‌ట్టింది. ఆరో రోజు నాటికి రూ.28కోట్ల‌ను దాటుతుంద‌ని చెబుతున్నారు.

ఏరియాల వారీగా మూడు రోజుల క‌లెక్ష‌న్లు

నిజాం రూ.5.07కోట్లు
సీడెడ్ రూ. 1.77కోట్లు
యూఏ రూ.1.73కోట్లు
గుంటూరు రూ. 1.27కోట్లు
ఈస్ట్ రూ.1.61కోట్లు
వెస్ట్ రూ. 1.05కోట్లు
క‌`ష్ణా రూ.1.25కోట్లు
నెల్లూరు రూ. 0. 46
ఏపీ,టీఎస్ రూ.14.21కోట్లు

సంక్రాంతి వ‌సూళ్ల‌లో దూసుకెళ్తున్న “ఎఫ్ 2 “
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share