విడుద‌ల‌కు ముందే “ఎఫ్‌2 ” వ‌సూళ్ల రికార్డు..

January 11, 2019 at 12:57 pm

యంగ్ హీరో వ‌రుణ్ తేజ్‌..సీనియ‌ర్ హీరో విక్ట‌రీ వెంక‌టేష్ న‌టించిన ఎఫ్‌2 సినిమా శ‌నివారం విడుద‌ల కానుంది. తెలుగు ప్రేక్ష‌కుల‌కు సంక్రాంతి కానుక‌గా ఈ సినిమా వ‌స్తోంది. వెంక‌టేష్ స‌ర‌స‌న త‌మన్నా..వ‌రుణ్‌కు జోడీ మెహ‌రీన్ క‌థానాయిక‌లుగా న‌టిస్తున్నారు. దిల్‌రాజ్ నిర్మాత ఈసినిమాను చాలా ప్ర‌తిష్ఠాత్మ‌కంగా తెర‌కెక్కించ‌గా అనిల్‌రావిపూడి మంచి ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా చిత్రీక‌రించిన‌ట్లు చిత్ర‌వ‌ర్గాల ద్వారా తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాల‌తో పాటు ప‌లు దేశాల్లో కూడా విడుద‌ల చేస్తున్నారు. థియేట‌ర్ సినిమా హ‌క్కుల ద్వారా రూ.34కోట్లు ముందుగానే ఈ చిత్రం రాబ‌ట్ట‌డం విశేషం. ఈ వ‌సూళ్లు అటు వెంక‌టేష్‌కు..ఇటు వ‌రుణ్‌తేజ్ కెరీర్‌లోనే అత్యధిక వ‌సూళ్లు సాధించిన చిత్రంగా చెప్ప‌వ‌చ్చు.

ఈ సినిమా పూర్తిగా ఫ్యామిలీ ఎంటైర్‌టైన‌ర్గా ఉంటుంద‌ని, న‌వ‌ర‌సాల‌తో పాటు కామెడీకి పెద్ద పీట వేసిన‌ట్లు ఇప్ప‌టికే ద‌ర్శ‌కుడు ప‌లుమార్లు వేదిక‌ల‌పై స్ప‌ష్టం చేశారు. ఇక చిత్ర ప్ర‌చారంలో భాగంగా విక్ట‌రీ వెంక‌టేష్అ ‘‘ఎఫ్‌ 2’ని 80 శాతం కామెడీతోనే నింపేశాం. టైమింగ్‌ ఉన్న గొప్ప నటులు ఈ సినిమాలో పనిచేశారు. వెంకీ – తమన్నా మధ్య ఉండే కెమిస్ట్రీ, కామెడీని ప్రేక్షకులు బాగా ఆస్వాదిస్తారు, వరుణ్‌ తెలంగాణ యాసతో ఆకట్టుకుంటాడ’’న్నారు. చూడాలి మ‌రి ఎఫ్‌2 ఏమేర‌కు అంచ‌నాలు అందుకుని సంక్రాంతి విన్న‌ర్‌గా నిలుస్తోందో లేదో..?

విడుద‌ల‌కు ముందే “ఎఫ్‌2 ” వ‌సూళ్ల రికార్డు..
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share