‘ స్పైడ‌ర్ ‘ ఫ‌స్ట్ రివ్యూ & రేటింగ్‌… హైలెట్స్‌

ఏఆర్‌.మురుగదాస్ దర్శకత్వంలో టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేష్‌బాబు హీరోగా న‌టించిన స్పైడ‌ర్ సినిమా మ‌రి కొద్ది గంట‌ల్లోనే ప్రీమియ‌ర్ షోలు ప‌డిపోనుంది. ముందుగా ఓవ‌ర్సీస్‌లో స్టార్ట్ అయ్యే ప్రీమియ‌ర్ షోలు ఆ వెంట‌నే రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ప‌డిపోనున్నాయి. ఈ సినిమాతో మ‌హేష్ తొలిసారి తెలుగు తెర‌కు ప‌రిచ‌యం అవుతున్నాడు.

ఇక ఎప్ప‌టిలాగానే దుబాయ్ సెన్సార్ బోర్డు మెంబ‌ర్ ఉమైర్ సంధు స్పైడ‌ర్ సినిమా ఫ‌స్ట్ రివ్యూతో పాటు రేటింగ్ ఇచ్చేశాడు. ద‌స‌రాకు మ‌హేష్ ఫ్యాన్స్‌తో పాటు తెలుగు సినిమా వాళ్లంతా స్పైడ‌ర్‌తో పండ‌గ చేసుకుంటార‌ని స్పైడ‌ర్‌ను ఓ రేంజ్‌లో ఆకాశానికి ఎత్తేశాడు. యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమా కథ, కథనం.. ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటుంద‌ని ఉమైర్ తేల్చేశాడు.

ఇక సినిమాలో విల‌న్ రోల్ అమితంగా ఆక‌ట్టుకుంటుంద‌ని, స‌మాజానికి పెద్ద డేంజ‌ర్‌గా మారిన ఓ విల‌న్‌ను హీరో ఎలా అంతం చేశాడ‌న్న‌దే స్పైడ‌ర్ స్టోరీ అట‌. కనిపించకుండా విలన్ చేస్తున్న ఘోరాలకు అడ్డుకట్ట వేస్తూనే, ఆ విలన్‌ ఎవరో కనిపెట్టడం కోసం వేసే ఎత్తులు, విలన్ వేసే పై ఎత్తులు.. ఆద్యంతం ఉత్కంఠను రేకెత్తిస్తాయట‌.

మ‌హేష్ ఎప్ప‌టిలాగానే త‌న‌దైన స్టైల్లో సూప‌ర్బ్ యాక్టింగ్ చేశాడ‌ని, ఇక విల‌న్‌గా చేసిన ఎస్‌.జె.సూర్య యాక్టింగ్ కూడా పీక్ స్టేజ్‌లో ఉంటుంద‌ని ఉమైర్ చెప్పాడు. హీరోయిన్ రకుల్ ప్రీత్‌సింగ్ కూడా తన పాత్రకు న్యాయం చేసిందనీ, హీరో స్నేహితుడి పాత్రలో ప్రియదర్శి, ఇతర తారాగణం బాగానే నటించారంటున్నారు. ఈ సినిమా మొత్తంలో క్లైమాక్స్ బెస్ట్ పార్ట్ అని ఉమైర్ చెప్పాడు.

ఇక ఫైన‌ల్‌గా ద‌స‌రాకు స్పైడ‌ర్ సూప‌ర్ డూప‌ర్ హిట్ అవుతుంద‌ని చెప్పిన ఉమైర్ స్పైడ‌ర్ సినిమాకు 3.5/5 రేటింగ్ కూడా ఇచ్చారు. ఇదిలా ఉండగా జై లవకుశ సినిమా హిట్ అవుతుందని ఒకరోజు ముందుగానే ఉమైర్ ఆ సినిమాకు 3.5/5 రేటింగ్ ఇవ్వడం గమనార్హం.