చిరు రికార్డు బ్రేక్ చేసిన ‘గీతాగోవిందం’!

September 15, 2018 at 9:53 pm

టాలీవుడ్ లో పెళ్లి చూపులు సినిమాతో హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్న విజయ్ దేవరకొండ తర్వాత సినిమా అర్జున్ రెడ్డి. ఈ సినిమాతో మనోడికి తెలుగు రాష్ట్రాల్లో వచ్చిన క్రేజ్ అంతా ఇంతా కాదు. ఇక గీతా ఆర్ట్స్ బ్యానర్ లో పరుశరామ్ దర్శకత్వంలో ‘గీతా గోవిందం’ సినిమాతో మరోసారి అభిమానుల ముందుకు వచ్చాడు విజయ్ దేవరకొండ. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ నటనకు అభిమానులు ఫిదా అయ్యారు. అర్జున్ రెడ్డిలో బోల్డ్ గా నటించిన విజయ్ దేవరకొండ గీతా గోవిందంలో భలే నవ్వించాడు. చిన్న సినిమాగా రిలీజ్ అయిన ‘గీతాగోవిందం’ ప్రభంజనం సృష్టించింది.

స్టార్ హీరోల సినిమాల రేంజ్ లో ఏకంగా వంద కోట్ల క్లబ్ లో చేరింది. అమెరికా టాప్-10 టాలీవుడ్ చిత్రాల్లో చోటు దక్కించుకుంది. తాజాగా గీతాగోవిందం మరో అరుదైన రికార్డు క్రియేట్ చేసింది. మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘ఖైదీ నెంబర్ 150’ ని బీట్ చేసింది ‘గీతాగోవిందం’. ఈ సినిమా ఓవర్సీస్‌లో 2.447 మిలియన్ డాలర్ల వసూళ్లతో టాప్-9లో ఉన్న ‘ఫిదా’ను టాప్-10కు, టాప్-8లో ఉన్న ‘ఖైదీ నంబర్ 150’ని టాప్-9కి పంపంచి.. ప్రస్తుతానికి టాప్-8లో సెటిలయ్యింది. ఈ సినిమా కలెక్షన్లు ఇలాగే కొనసాగితే.. ఓవర్సీస్‌లో ‘అ..ఆ’, ‘మహానటి’ కలెక్షన్లను కూడా ఈజీగా దాటేసి.. ఏకంగా టాప్-6కు ఎగబాకే అవకాశాలు ఉన్నాయంటున్నారు.1484150808_khaidi-no-150-chiranjeevi-kajal-aggarwal

ఇక ఇప్పటి వరకు ఓవర్సీస్ రికార్డుల విషయానికొస్తే టాప్-1 అండ్ 2 పొజిషన్లలో ‘బాహుబలి’,‘బాహుబలి 2 ’ సినిమాలు ఉన్నాయి. మూడవ స్థానంలో ‘రంగస్థలం’, నాలుగు, ఐదు స్థానాల్లో ‘భరత్ అనే నేను’, ‘శ్రీమంతుడు’ ఉన్నాయి. మొత్తానికి అప్ కమింగ్ హీరో అయిన విజయ్ దేవరకొండ స్టార్ హీరో రేంజ్ లో వసూళ్లు రాబట్టడం ఒకంత ఆశ్చర్యమే అనిపించినా..యూత్ కి బాగా కనెక్ట్ అయిన హీరో అందుకే ఈ రేంజ్ లో కొనసాగుతున్నారని అంటున్నారు సినీ విశ్లేషకులు. భవిష్యత్ లో ఇంకెన్ని రికార్డులు విజయ్ ఖాతాలో చేరతాయో చూడాలి మరి.

చిరు రికార్డు బ్రేక్ చేసిన ‘గీతాగోవిందం’!
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share