ఇవి తీసుకుంటే..మీ ఒంట్లో వేడి ఎగిరిపోవాల్సిందే!

July 18, 2018 at 1:18 pm

ఈ మద్య కొన్ని ఆయిల్ ఫుడ్స్ ఒంటికి అస్సలు పడటం లేదు.  బయట తినే ఆయిల్ ఫుడ్స్ వల్ల ఆరోగ్యం దెబ్బతినడమే కాదు..ఒంట్లో వేడి పుట్టడం..రక రకాల ఇబ్బందులు కలగడం జరుగుతుంది.  ప‌లు ఆహార ప‌దార్థాల‌ను తిన‌డం వ‌ల్ల కూడా శ‌రీరం వేడెక్కుతుంది. దీంతో కొంద‌రిలో చెమ‌ట పొక్కులు, చెమ‌ట కాయ‌లు అధికంగా వ‌స్తాయి. కొంద‌రికి అధిక వేడి కార‌ణంగా విరేచ‌నాలు అవుతాయి. ఇలా శ‌రీర తత్వాన్ని బ‌ట్టి శ‌రీరంలో ఉండే అధిక వేడి బ‌య‌ట‌కు వెళ్తుంటుంది. ఈ క్ర‌మంలోనే అధిక వేడి బారిన ప‌డే వారు కింద చెప్పిన ప‌లు సూచ‌న‌లు పాటిస్తే దాంతో శ‌రీరాన్ని చ‌ల్ల‌గా మార్చుకోవ‌చ్చు.download

 

– శ‌రీరంలోని వేడిని తొల‌గించ‌డంలో గ‌స‌గ‌సాలు బాగా ప‌నిచేస్తాయి. వీటి పొడిని చాలా త‌క్కువ మోతాదులో తీసుకుని దాన్ని నీటిలో క‌లిపి తాగితే ఫ‌లితం ఉంటుంది. 

 

– ఒక గ్లాస్ చ‌ల్ల‌ని పాల‌లో ఒక టీస్పూన్ తేనె క‌లుపుకుని తాగితే శ‌రీరంలో ఉండే అధిక వేడి మొత్తం బ‌య‌ట‌కు పోతుంది. శ‌రీరం చ‌ల్ల‌గా మారుతుంది. 

 

– ఒక గ్లాస్ పాల‌లో కొద్దిగా వెన్న క‌లుపుకుని తాగితే స‌మస్య నుంచి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది. 

 

– ఒక టేబుల్ స్పూన్ మెంతుల్ని అలాగే తినాలి. లేదంటే వాటిని పొడి చేసి నీటిలో క‌లుపుకుని కూడా తాగ‌వ‌చ్చు. ఇలా చేయ‌డం వ‌ల్ల కూడా అధిక వేడి నుంచి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది. 

 

– ఒక గ్లాస్ దానిమ్మ ర‌సం తాగితే అధిక వేడి వెంట‌నే త‌గ్గుతుంది. అందులో అవ‌స‌రం అనుకుంటే కొద్దిగా బాదం నూనె క‌లుపుకుని తాగ‌వ‌చ్చు. ఇలా చేయ‌డం వ‌ల్ల ఇంకా మంచి ఫ‌లితం ఉంటుంది. 

 

– నిమ్మ‌ర‌సం, లేదా అలోవెరా (క‌ల‌బంద‌) జ్యూస్‌ను తాగినా అధిక వేడి.

 

– ఒక గ్లాస్ పాల‌లో కొద్దిగా వెన్న క‌లుపుకుని తాగితే స‌మస్య నుంచి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది. lait-chaud-toux

ఇవి తీసుకుంటే..మీ ఒంట్లో వేడి ఎగిరిపోవాల్సిందే!
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share