అబ్బబ్బా.. హెబ్బా ముద్దుల‌కు వేళాయే..

November 20, 2018 at 1:02 pm

అబ్బ‌బ్బా.. హెబ్బా.. ఆ సీన్లు ఒక‌టి రెండు ఉంటేనే ఊగిపోయే యూత్‌.. ఇప్పుడు హెబ్బా ముద్దుల వ‌ర్షంలో త‌డిసిపోయేందుకు సిద్ధ‌మ‌వుతోంది. ఒక‌టి కాదు రెండు కాదు ఏకంగా 24 ముద్దులు.. హ‌ద్దుల్ని దాటేసి పెట్టేసిందట‌. ఇప్ప‌టికే వ‌చ్చిన అర్జున్‌రెడ్డి, ఆర్ఎక్స్‌-100 సినిమాలు ఎంత‌టి సెన్సేష‌న్ క్రియేట్ చేశాయో తెలియంది కాదు.. ఇదే ఒర‌వ‌డిలో దూసుకొస్తోంది మ‌రో సినిమా `24 కిస్సెస్‌`. నీకో స‌గం.. నాకో స‌గం..ఈ ఉత్స‌వం.. అనేది ఉప శీర్షిక‌. ఈ సినిమా పేరుతోనే యూత్లో వేడి పుట్టించింది చిత్ర యూనిట్‌. ఆ సినిమా ట్రైల‌ర్‌తో మ‌రిన్ని అంచ‌నాలు పెరిగిపోయాయి.972143827d757a6f47d465635b8bc3cc

యువ ద‌ర్శ‌కులు, హీరోహీరోయిన్లు టాలీవుడ్‌ను కొత్త రూట్‌లోకి తీసుకెళ్తున్నారు. ఏళ్ల‌కొద్దీ నాటుకుపోయిన మూస ధోర‌ణిని పాత‌రేసి స‌రికొత్త ట్రెండ్‌ను క్రియేట్ చేస్తున్నారు. అరుణ్‌ అదిత్‌, హెబ్బా పటేల్‌ జంటగా ద‌ర్శ‌కుడు అయోధ్యకుమార్‌ కృష్ణంశెట్టి ఈ సినిమా తీశారు. అయితే.. పేరుతోనే యూత్‌ను ఆక‌ట్టుకున్నాడు ఈ ద‌ర్శ‌కుడు. సంజయ్‌రెడ్డి, అనిల్‌ పల్లెలతో కలిసి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 23న చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. ఇందులో హీరోయిన్ హెబ్బా ప‌టేల్ కురిపించిన ముద్దుల వ‌ర్షంలో త‌డిసిపోవాల‌ని యూత్ ఎదురుచూస్తోంది. ఇటీవల జరిగిన ప్రీరిలీజ్‌ వేడుకలో జాయ్‌ బరువా సంగీతమందించిన పాటల సీడీలను లక్ష్మీ మంచు విడుదల చేసిన విష‌యం తెలిసిందే.

అయితే.. ఇలాంటి టైటిల్‌పై దర్శకుడు స్పందించాడు. ‘‘నేను 2016లో ఈ సినిమా ప్రారంభిచేటప్పటికి ‘అర్జున్‌రెడ్డి’, ‘ఆర్‌ఎక్స్‌ 100’ సినిమాలు రాలేదు. అయినా… ఆ రెండు సినిమాలు ముద్దుల వల్ల్లే హిట్‌ కాలేదు. అసలు, ముద్దుల వల్ల ఏ సినిమా హిట్‌ కాదు. ముద్దు, కౌగిలింత.. ఏదైనా ఒక ఎక్స్‌ప్రెషన్‌. నేను చీప్‌ ట్రిక్స్‌ మీద ఆధారపడలేదు. విజయంపై నమ్మకంతో నైజాంలో చిత్రాన్ని విడుదల చేస్తున్నా’’ అని చెప్పుకొచ్చాడు. హీరో అరుణ్‌ అదిత్‌ మాట్లాడుతూ ‘‘ఇంట్రెస్టింగ్‌ స్ర్కిప్ట్‌తో సినిమా తెరకెక్కింది. ముద్దులు పెట్టే సినిమా చేయడం చాలా కష్టం’’ అన్నారు.

అబ్బబ్బా.. హెబ్బా ముద్దుల‌కు వేళాయే..
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share