‘ హ‌లో ‘ మూవీ స‌ర్‌ఫ్రైజ్‌… టార్గెట్ చాలా పెద్ద‌దే

అక్కినేని అఖిల్ హీరోగా రాబోతున్న మూవీ హలో. 2015లో ద‌స‌రాకు త‌న తొలి సినిమా అఖిల్‌తో ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌యం అయిన అఖిల్ తొలి సినిమాతోనే పెద్ద డిజాస్ట‌ర్‌ను ఎదుర్కొన్నాడు. వివి.వినాయ‌క్ డైరెక్ష‌న్‌లో తెర‌కెక్కిన అఖిల్ సినిమా ప‌రాజ‌యం దెబ్బ‌తో అటు వినాయ‌క్‌, ఇటు అఖిల్ ఇద్ద‌రూ ఆరు నెల‌ల పాటు బ‌య‌ట‌కు రాలేదు. అఖిల్ దెబ్బ‌తో నాగ్ కూడా షాక్ అయ్యాడు. దీంతో త‌న కుమారుడు రెండో సినిమా విష‌యంలో చాలా జాగ్ర‌త్త‌లు తీసుకున్న నాగ్ ఈ సినిమాను త‌న అన్న‌పూర్ణ బ్యాన‌ర్‌లోనే విక్ర‌మ్‌కుమార్ డైరెక్ష‌న్‌లో చాలా ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మించారు.

హ‌లో టైటిల్‌తో తెర‌కెక్కిన ఈ సినిమా డిసెంబ‌ర్ 23న వ‌ర‌ల్డ్ వైడ్‌గా గ్రాండ్‌గా రిలీజ్ అవుతోంది. ఈ సినిమాకు థియేట్రిక‌ల్‌, డిజిట‌ల్‌, శాటిలైట్ రైట్స్ క‌లుపుకుంటే రూ.50 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ జ‌రిగింది. కేవ‌లం థియేట్రిక‌ల్ రైట్స్ మాత్ర‌మే రూ.40 కోట్ల‌కు అమ్ముడ‌య్యాయి. ప్రింట్ ఖ‌ర్చులు కూడా క‌లుపుకుంటే అఖిల్ సినిమా రూ.42 కోట్ల థియేట్రిక‌ల్ షేర్ రాబ‌ట్టాల్సి ఉంటుంది. ఇది అఖిల్‌కు పెద్ద టార్గెట్టే. ఈ లెక్క‌న గ్రాస్ ప‌రంగా చూస్తే హ‌లో రూ.70-75 కోట్ల వ‌ర‌కు రాబ‌ట్టాలి. 

పైగా హ‌లో ఈ సినిమాకు పోటీగా నాని ఏంసీఏ – అల్లు శిరీష్ ఒక్క క్ష‌ణం ఉన్నాయి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని ప్రచార కార్యక్రమాల్లో బిజీబిజీగా ఉంది. యాక్షన్ సీక్వెన్స్‌లతో లవ్ ఎంటర్‌టైనర్‌గా తెర‌కెక్కుతోన్న ఈ సినిమాలో అఖిల్ పేరు గురించి చిన్న మ్యాట‌ర్ ఇండ‌స్ట్రీలో లీక్ అయ్యింది. ఈ సినిమాలో అఖిల్ పేరు అవినాష్‌ అని సమాచారం.