హీరో నాని పోలీస్ అయితే !

September 8, 2018 at 6:19 pm

టాలీవుడ్ లోకి అసిస్టెంట్ డైరెక్టర్ గా ఇంట్రడ్యూస్ అయిన నాని..అష్టాచమ్మ సినిమాతో హీరోగా మారాడు. ఎవడే సుబ్రమాణ్యం తర్వాత మనోడికి బాగా కలిసి వచ్చింది. మారుతి డైరెక్షన్ లో భలే భలే మగాడివోయ్ సినిమా తర్వాత నాని మళ్లీ వెనక్కి తిరిగి చూసుకోలేదు. నేచురల్ స్టార్ గా పేరు తెచ్చుకున్న నాని నిజంగా పక్కింటి అబ్బాయిలా కనిపించడం ప్లస్ పాయింట్ అయ్యింది. ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ 2 కి హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు.aaaaa-1024x734

హీరో నాని సినిమా సినిమాకు డిఫరెంట్ గా సబ్జెక్ట్ వుండేలా చూసుకుంటాడు. రిసెంట్ గా వచ్చిన ఒక్క కృష్ణార్జున యుద్ధం సినిమా తప్ప మరేదీ పెద్దగా నిరాశ పర్చలేదు. ప్రస్తుతం కింగ్ నాగార్జున, నాని కాంబినేషన్ లో మల్టీస్టారర్ సినిమా ‘దేవదాస్’ వస్తుంది. దేవదాస్ సినిమా ఫినిష్ చేసిన నాని తన తరువాత సినిమాగా జెర్సీ స్టార్ట్ చేసే అవకాశం వుంది. దాని తరువాత మైత్రీ మూవీస్ కు చంద్రశేఖర్ యేలేటి డైరక్షన్ లో ఓ సినిమా ఓకె చేసాడు.NANI-1024x6801536390379

యేలేటి అన్నీ కాస్త డిఫరెంట్ స్టోరీలు రాసుకుంటారు కాబట్టి, నానిని పోలీస్ గా చూపించబోతున్నారు. అయితే పోలీస్ ఆఫీసర్ అంటే యాంగ్రీ యంగ్ మాన్ గా కాకుండా కాస్త విఫరెంట్ గా చూపించడం యేలేటి చంద్రశేఖర్ వెన్నెతో పెట్టి విద్య..మరి ఈ సినిమాలో నానిని పోలీస్ గా చూపించబోతున్నారు. అంటే సమ్ థింగ్ ఏదో వుంటుంది కచ్చితంగా. మరిన్ని వివరాలు వచ్చేవరకు వెయిట్ చేయాల్సిందే.

హీరో నాని పోలీస్ అయితే !
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share