సీనియ‌ర్ హీరోయిన్ రాధిక‌కు కేన్సర్‌… రిప్లే

May 22, 2018 at 3:24 pm
radhika sarathkumar-

ఇటీవ‌ల కాలంలో నిజా నిజాల‌తో సంబంధం లేకుండా వైర‌ల్ అవుతోంది. సోష‌ల్ మీడియా ప్ర‌భావం బాగా పెరిగిపోవ‌డంతో అస‌లు ఏం జ‌రిగింది అనే దానితో సంబంధం లేకుండా న్యూస్ స్ప్రెడ్ చేసేస్తున్నారు. చివ‌ర‌కు అస‌లు నిజం తెలుసుకునే స‌రికే జ‌ర‌గాల్సిన న‌ష్టం జ‌రిగిపోతోంది. దీని వ‌ల్ల ఎంతో మంది బాధితులుగా మారిపోతున్నారు. ఇప్పుడు ఈ ఫేక్ న్యూస్‌తో సీనియ‌ర్ న‌టి రాధిక తీవ్ర ఇబ్బందులు ప‌డ్డారు.

 

సీనియ‌ర్ హీరో శ‌ర‌త్‌కుమార్ భార్య అయిన రాధిక కొన్ని రోజులుగా బ్ల‌డ్ కేన్స‌ర్‌తో బాధ‌ప‌డుతున్నార‌ని, ప్ర‌స్తుతం ఆమె ఆస్ప‌త్రిలో చికిత్స తీసుకుంటున్నార‌ని, అందుకే బ‌య‌ట కనిపించ‌డం లేద‌ని వార్తలు బ‌య‌ల్దేరాయి. ఈ వార్తలు గ‌త కొద్ది రోజులుగా తీవ్రంగానే హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి. 

 

ఈ న్యూస్ త‌మిళ‌నాడు మొత్తం పాకిపోయింది. దీంతో ఓ అభిమాని ట్విట‌ర్ ద్వారా నేరుగా రాధిక‌నే కేన్స‌ర్ గురించి ప్ర‌శ్నించాడు. దాంతో ఆ వార్త‌లేవీ నిజం కావ‌ని, అవ‌న్నీ ఊహాగానాలేన‌ని రాధిక‌ స‌మాధానం చెప్పారు. అయితే రాధిక స్పందించే స‌రికే ఈ వార్త అంద‌రికి తెలిసిపోయింది. ఇక‌పై అయినా నిజానిజాలు తెలుసుకున్నాక ఇలాంటి వార్త‌లు స్ప్రెడ్ చేస్తే మంచిది.

సీనియ‌ర్ హీరోయిన్ రాధిక‌కు కేన్సర్‌… రిప్లే
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts


Share
Share