బంగారం చాటున హీరోయిన్ అందాలు

November 21, 2018 at 11:21 am

బాబోయ్.. ఒంటిపై నూలు పోగు కూడా లేకుండా ఆ బ‌యోపిక్ ఫ‌స్ట్‌లుక్ విడుద‌ల చేశారు. ఈ ఫ‌స్ట్‌లుక్ పోస్ట‌ర్ తోనే సినిమాపై హైప్ క్రియేట్ చేశారు. అయితే.. ఆ బ‌యోపిక్ ఎవ‌రిది..? అందులో న‌టిస్తున్న‌దెవ‌రు..? అని తెలుసుకోవాల‌నే ఉత్సుక‌త మీలో క‌లుగుతుంది క‌దా..! అయితే.. ఇక సూటిగా విష‌యానికి వ‌ద్దాం.. ఆ వివ‌రాలేమిటో తెలుసుకుందాం.. ఈ మ‌ధ్య కాలంలో తెలుగులో బ‌యోపిక్‌ల రూప‌క‌ల్ప‌న ఎక్కువ‌గా జ‌రుగుతోంది. ఇప్ప‌టికే సావిత్రి బ‌యోపిక్ వ‌చ్చింది. ఈ సినిమా మాంచి విజ‌యం సాధించింది.richa-shakeela

అంతకుముందు ప్ర‌ముఖ న‌టి సిల్క్‌స్మిత బ‌యోపిక్ డ‌ర్టీపిక్చ‌ర్ పేరుతో వ‌చ్చిన విష‌యం తెలిసిందే. ఇందులో విద్యాబాల‌న్ కీ రోల్ పోషించింది. ఈ సినిమా ఎంత‌టి విజ‌యం సాధించిందో తెలిసిన విష‌యమే. తాజాగా.. మ‌రో బ‌యోపిక్ కూడా వ‌స్తోంది. అది మ‌రివ‌రిదో కాదు.. ఎక్కువ‌గా అడ‌ల్ట్ సినిమాల్లో నటించిన ష‌కీలా. ష‌కీల జీవితం ఆధారంగా ఇంద్రజిత్ లంకేశ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న బ‌యోపిక్‌ ‘షకీలా’. ఈ చిత్రంలో లీడ్ రోల్‌లో రిచా చద్దా నటిస్తోంది. ఈ సినిమాకు ‘షకీలా’ అనే టైటిల్, ‘నాట్ ఎ పోర్న్ స్టార్’ అనే ట్యాగ్‌లైన్ పెట్టారు.46513812_2293438500925373_5262681560171151360_n

అయితే.. తాజాగా ఈ బ‌యోపిక్‌ ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఇక్క‌డ ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం ఏమిటంటే.. ఈ పోస్టర్‌లో ఒంటిపై నూలు పోగు కూడా లేకుండా కనిపించింది హీరోయిన్‌ రిచా చద్దా. కేవలం బంగారు ఆభరణాలతోనే రిచా ఒంటిని కవర్ చేశారు. ఇప్పుడీ పోస్ట‌ర్ నెట్టింట్లో తెగ వైర‌ల్ అవుతోంది. అయితే..ష‌కీలా ఎక్కువగా అడల్ట్ సినిమాల్లో నటించిన విష‌యం తెలిసిందే. ఆమెను పోర్న్‌స్టార్ అని కూడా అంటుంటారు. అయితే.. ష‌కీలా పోర్న్‌స్టార్ కాద‌నీ..ఆమె జీవితంలో ఎన్నో ఆస‌క్తిక‌ర‌మైన కోణాలున్నాయ‌నే విష‌యాన్ని ఈ సినిమాతో చెప్ప‌బోతున్నార‌ని తెలుస్తోంది. ఈ బ‌యోపిక్‌ను వచ్చే వేసవిలో విడుద‌ల చేసేందుకు స‌న్నాహాలు చేస్తున్నారు. అప్ప‌టిదాకా ఆగాల్సిందే మ‌రి.

బంగారం చాటున హీరోయిన్ అందాలు
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share