టీడీపీ ఎమ్మెల్యే డోలా పై అధిష్టానం సీరియస్..రీజన్ ఇదే

October 20, 2018 at 3:46 pm
High command serious on Dola

ప్ర‌కాశం జిల్లా కొండ‌పి టీడీపీ రాజ‌కీయాల‌పై చాలా సీరియ‌స్‌గా ఉన్న టీడీపీ అధినేత చంద్ర‌బాబునాయుడు.. ఈ విష‌యం లో స్థానిక ఎమ్మెల్యే శ్రీడోలా బాల‌వీరాంజ‌నేయ స్వామికి తలంట‌డం ఖాయంగా క‌నిపిస్తోంది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించాల‌ని, ప్ర‌కాశంలోని అన్ని స్థానాల్లోనూ గెలుపు గుర్రం ఎక్కాల‌ని చంద్ర‌బాబు నిర్ణ‌యించుకున్నారు. అయితే, దీనికి విరుద్ధంగా వ్య‌వ‌హ‌రిస్తున్న‌వారు పార్టీకి న‌ష్టం చేకూరుస్తున్న‌వారు పెరుగుతుండ‌డంతో చంద్ర‌బాబు తీవ్రంగానే స్పందిస్తు న్నారు. ముఖ్యంగా పార్టీ ఇంచార్జుల‌ను, అధ్య‌క్ష‌ల‌ను సైతం లెక్క‌చేయ‌కుండా ఇష్టాను సారంగా వ్య‌వ‌హ‌రిస్తున్న‌వారిపై చ‌ర్య‌ల‌కు కూడా చంద్ర‌బాబు దిగే ఛాన్స్ ఉంద‌ని అంటున్నారు.

గ‌త కొన్నాళ్లుగా ప్ర‌కాశం జిల్లాలోని కొండ‌పి నియోజ‌క‌వ‌ర్గం తీవ్ర స్థాయిలో విభేదాల‌తో మీడియాలో నిలుస్తోంది. ఇక్క‌డ నుంచి గెలుపొందిన డాక్ట‌ర్ డోలా.. తొలి రెండేళ్లు ప‌ర్వాలేద‌ని అనిపించినా.. ఇప్పుడు మాత్రం పార్టీలోని సీనియ‌ర్ల‌ను ఆ య‌న లెక్క‌చేయ‌డం లేదు ముఖ్యంగా గ‌త ఎన్నిక‌ల్లో త‌నగెలుపున‌కు కృషి చేసిన వారిని సైతం ఆయ‌న ప‌క్క‌న పెడుతు న్నారు. ముఖ్యంగా గ‌త ఎన్నిక‌ల్లో త‌న‌కు టికెట్ వ‌చ్చేందుకు ఎంత‌గానో కృషి చేసిన ఒంగోలు ఎమ్మెల్యే దామ‌చ‌ర్ల జ‌నార్ద‌న్‌పై క‌త్తిక‌ట్టిన‌ట్టు వ్య‌వ‌హ‌రిస్తున్నారు. అదేస‌మ‌యంలో ఆయ‌న సోద‌రుడు స‌త్యాతో క‌లిసి వేరే వ‌ర్గంగా ఏర్ప‌డి.. పెద్ద ఎత్తున ఆరోప‌ణ‌లు కూడా చేస్తున్నారు. ప్ర‌జ‌ల్లోనూ ఇప్పుడు డోలాపై సానుభూతి పోయింది.

త‌న ఇష్టానుసారంగా వ్య‌వ‌హ‌రించ‌డం, పార్టీ అధ్య‌క్షుడిని సైతం లెక్క‌చేయ‌క‌పోవ‌డం వంటి కీల‌క ప‌రిణామాలు డోలాను తీవ్రంగా భ్ర‌ష్టు ప‌ట్టించాయి. అంతేకాదు, కొండ‌పిలో మంచి ప‌లుకుబ‌డి, ఓటు బ్యాంకు కూడా ఉన్న మాగుంట శ్రీనివాసుల రెడ్డిని సైతం డోలా లెక్క‌చేయ‌క‌పోవ‌డం చ‌ర్చ‌కు వ‌చ్చిన ప్ర‌ధాన అంశం. ఈ నేప‌థ్యంలోనే చంద్ర‌బాబు ఇక్క‌డి నుంచి అందిన ఫిర్యాదుల‌పై స్పందించారు. బాబు త్వ‌ర‌లోనే కొండ‌పి నియోజ‌క‌వ‌ర్గం రాజ‌కీయాల‌పై దృష్టి పెట్ట‌నున్నారు. ఎమ్మెల్యే డోలాకు ఒక‌ర‌కంగా చంద్ర‌బాబు క్లాస్ ఇస్తార‌ని అంటున్నారు. ఆయ‌న ఒంటెత్తు పోక‌డ‌ల‌తో పార్టీ న‌ష్ట‌పోతోంద‌ని, ఆయ‌న వ్య‌వ‌హార శైలి మార్చుకోవాల్సిన అవ‌స‌రం ఉంద‌నేది చంద్ర‌బాబు మాట‌. అయితే, ఇదే విష‌యంపై కింది స్థాయి నేత‌లు ఎంత చెప్పినా ప‌ట్టించుకోని డోలాకు ఇప్పుడు చంద్ర‌బాబు నేరుగా తలంట‌డం ఖాయ‌మ‌ని తెలుస్తోంది. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.

టీడీపీ ఎమ్మెల్యే డోలా పై అధిష్టానం సీరియస్..రీజన్ ఇదే
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts


Share
Share