‘ జై ల‌వ‌కుశ‌ ‘ లో ఈ ఒక్క సీన్‌కు ఫీజులు ఎగరాల్సిందే… మేజ‌ర్ హైలెట్‌

September 16, 2017 at 7:45 am
Jai lava Kusa, NTR

టాలీవుడ్ యంగ్‌టైగ‌ర్ జూనియ‌ర్ ఎన్టీఆర్ కెరీర్‌లోనే భారీ ప్రి రిలీజ్ బిజినెస్‌తో పాటు భారీ అంచ‌నాల మ‌ధ్య రిలీజ్ అవుతోంది జై ల‌వ‌కుశ‌. ఎన్టీఆర్ మూడు వ‌రుస హిట్ల‌తో ఉండ‌డంతో ఈ సినిమాకు రూ. 112 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ జ‌రిగింది. ఈ నెల 21న ఈ సినిమా భారీ ఎత్తున రిలీజ్ అవుతోంది.

ఎన్టీఆర్ కెరీర్‌లోనే తొలిసారి ట్రిబుల్ రోల్ చేస్తుండడంతో నంద‌మూరి, ఎన్టీఆర్ అభిమానుల‌తో పాటు టాలీవుడ్ సినీజ‌నాలు కూడా ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా ? ఫ‌స్ట్ షో ఎప్పుడు చూసేయాలా ? అన్న ఆస‌క్తితో వెయిట్ చేస్తున్నారు. ఈ సినిమాలో కొన్ని సీన్ల‌లో ఎన్టీఆర్ న‌ట విశ్వ‌రూపం చూపిస్తాడ‌న్న వార్త‌లు సినిమాపై మ‌రింత హైప్‌ను పెంచేస్తున్నాయి.

ఇక ఈ సినిమాలో 15 నిమిషాల సీన్లు ప్రేక్ష‌కుల‌కు మైండ్ బ్లోయింగ్ అయ్యేలా ఉండ‌డంతో పాటు ఫీజులు ఎగిరిపోయేలా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ సీన్లు ఏవో కాదు. ఇద్ద‌రు సీనియ‌ర్ ఎన్టీఆర్‌ల మ‌ధ్య రెండుసార్లు వ‌చ్చే పోరాట స‌న్నివేశాలకు థియేట‌ర్ల‌లో విజిల్స్ ఆగ‌వ‌ట‌. కొన్ని సీన్లలో ఎన్టీఆర్ న‌ట‌న క‌న్నీళ్లు పెట్టిస్తుంద‌ట‌.

ఇక సినిమా రిలీజ్ అయ్యాక అంద‌రూ జై పాత్ర గురించే మాట్లాడుకుంటార‌ట‌. ఇక టాలీవుడ్‌కు చెందిన న‌లుగురు స్టార్ డైరెక్ట‌ర్లు రీసెంట్‌గా ఈ సినిమా చూసి ఫిదా అయిపోయారట. ఎన్టీఆర్ కోసమే ఈ కథ పుట్టిందని, బాబీ చాలా బాగా తెరకెక్కించాడని ఆ దర్శకులు వ్యాఖ్యానించిన‌ట్టు స‌మాచారం.

 

‘ జై ల‌వ‌కుశ‌ ‘ లో ఈ ఒక్క సీన్‌కు ఫీజులు ఎగరాల్సిందే… మేజ‌ర్ హైలెట్‌
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts


Share
Share