‘ జై ల‌వ‌కుశ ‘ ప్ల‌స్‌లు – మైన‌స్‌లు &  రేటింగ్‌

September 20, 2017 at 7:32 am
Jai Lava Kusa, NTR

యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్ జై ల‌వ‌కుశ సినిమా రేపు ప్ర‌పంచ‌వ్యాప్తంగా రిలీజ్ అవుతోన్న విష‌యం తెలిసిందే. ఈ సినిమా ప్రీమియ‌ర్ షోలు ఓవ‌ర్సీస్‌లో ఈ రోజు నుంచే స్టార్ట్ అవుతున్నాయి. ఇక ఈ సినిమా ఓవ‌ర్సీస్‌తో పాటు ప్ర‌పంచ‌వ్యాప్తంగా 36 దేశాల్లో రిలీజ్ అవుతోంది. దీంతో అక్క‌డ కూడా సెన్సార్ నిబంధ‌న‌ల ప్ర‌కారం ఈ సినిమాను సెన్సార్ బోర్డు మెంబ‌ర్ల‌కు ప్ర‌ద‌ర్శించారు. ఇక దుబాయ్‌లో సెన్సార్ బోర్డు మెంబ‌ర్‌, ఇండియన్ సినిమాల క్రిటిక్ ఉమైర్ సంధు ఈ సినిమా చూసి త‌న స్పంద‌న తెలిపారు.

ఇండియ‌న్ సినిమాల‌కు రిలీజ్‌కు ముందే రివ్యూలు ఇస్తోన్న ఉమైర్ సంధు జై ల‌వ‌కుశ సినిమాకు కూడా రివ్యూ & రేటింగ్ ఇచ్చేశాడు. జై ల‌వ‌కుశ డైరెక్ట‌ర్ కేఎస్‌.ర‌వీంద్ర (బాబి) రాసుకున్న స్టోరీ, స్క్రీన్ ప్లేలో చాలా మాస్ మూమెంట్స్ ఉన్నాయ‌ని చెప్పిన సంధు క్లైమాక్స్ చాలా బాగుందని, స్టంట్స్ అదిరిపోయాయ‌ని చెప్పాడు. హీరోయిన్లు రాశీఖ‌న్నా, నివేదా థామ‌స్ యాక్టింగ్ సూప‌ర్బ్‌గా ఉంద‌న్న ప్ర‌శంసించాడు.

ఎన్టీఆర్‌ను ఒకేసారి తెర‌మీద మూడు పాత్ర‌ల్లో చూడ‌డానికి రెండు క‌ళ్లు చాల‌వ‌న్న ఉమైర్ కొన్ని పాట‌ల్లో ఎన్టీఆర్ డ్యాన్స్‌కు ఫిదా అయిపోవాల్సిందేన‌న్నాడు. కామెడీ, యాక్షన్ డ్రామా అభిమానులను, ప్రేక్షకులను కట్టిపడేస్తుందని ఆయన తెలిపారు. ఇక సినిమాలో లోపాల‌ను కూడా ఉమైర్ ఎత్తి చూపాడు. కొన్ని సీన్లు చాలా లెన్దీగా ఉన్నాయ‌ని, ఎడిటింగ్ ఇంకాస్త ట్రిమ్ చేసి ఉండాల్సింద‌ని అభిప్రాయ‌ప‌డ్డాడు.

ఇక ఫైనల్‌గా జై ల‌వ‌కుశ సినిమా ఎన్టీఆర్ కెరీర్‌లో బ్లాక్ బస్ట‌ర్ అని.. కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ అని ఉమైర్ ప్రశంసించారు. ఇక జై ల‌వ‌కుశ సినిమాకు ఉమైర్ 3.5 రేటింగ్ ఇచ్చాడు.

 

‘ జై ల‌వ‌కుశ ‘ ప్ల‌స్‌లు – మైన‌స్‌లు &  రేటింగ్‌
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts


Share
Share