గ్యారేజ్‌ను బీట్ చేయ‌లేక‌పోయిన ‘ జై ల‌వ‌కుశ ‘ అస‌లు కార‌ణం ఇదే

September 22, 2017 at 5:10 am
Jai Lava Kusa, Janatha Garage

యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్ జై ల‌వ‌కుశ సినిమా తొలి రోజు ప్ర‌పంచ‌వ్యాప్తంగా స‌త్తా చాటింది. భారీ అంచ‌నాలు, భారీ హైప్ మ‌ధ్య థియేటర్ల‌లోకి వ‌చ్చిన ఈ సినిమా ఈ సినిమా ఓవ‌ర్సీస్‌లో మంచి ఓపెనింగ్స్ రాబ‌ట్టింది. అమెరికాలో ఈ సినిమాను యూఎస్ తెలుగు మూవీస్ డిస్ట్రిబ్యూట్ చేసింది. మొత్తం 180కి పైగా లొకేషన్లలో ఒకరోజు ముందుగానే ప్రీమియర్ల ద్వారా యూఎస్‌లో జై లవకుశ సందడి చేసింది. ప్రీమియర్ షోలకు రికార్డు స్థాయిలో కలెక్షన్లు వచ్చాయని డిస్ట్రిబ్యూటర్లు చెబుతున్నారు.

అమెరికాలో 180కి పైగా స్క్రీన్లలో ప్రీమియర్ల బుధవారం రాత్రి జై లవకుశ సందడి చేసింది. 159 లొకేషన్ల నుంచి అందిన సమాచారం మేరకు ఈ సినిమా 5 లక్షల 25వేల డాలర్లను (3 కోట్ల 39 లక్షల 70వేల రూపాయలు) కలెక్ట్ చేసినట్లు డిస్ట్రిబ్యూటర్లు తెలిపారు. కేవ‌లం ప్రీమియ‌ర్ల‌తోనే హాఫ్ మిలియ‌న్ డాల‌ర్ల మార్క్ క్రాస్ చేయ‌డం చాలా గొప్ప విష‌య‌మే. ప్రీమియ‌ర్ల వ‌సూళ్ల లెక్క‌ల వ‌ర‌కు చూసుకుంటే జై ల‌వ‌కుశ తెలుగు సినిమాల్లో టాప్-10 జాబితాలో 6వ స్థానం దక్కించుకుంది.

ఈ సినిమాతో తార‌క్ మంచి వ‌సూళ్లే రాబ‌ట్టినా త‌న గ‌త బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమా అయిన జ‌న‌తా గ్యారేజ్ సినిమా ప్రీమియ‌ర్ రికార్డునే బ్రేక్ చేయ‌లేకపోయాడు. ప్రీమియ‌ర్ల‌లో ఎక్కువ క‌లెక్ష‌న్లు కొల్ల‌గొట్టిన తెలుగు చిత్రాల్లో జ‌న‌తా గ్యారేజ్ 5 వ ప్లేస్‌లో ఉండ‌గా జై ల‌వ‌కుశ 6వ ప్లేస్‌తో స‌రిపెట్టుకోవాల్సి వ‌చ్చింది. గ్యారేజ్ ప్రీమియ‌ర్ క‌లెక్ష‌న్ల రికార్డును జై ల‌వ‌కుశ బ్రేక్ చేయ‌క‌పోవ‌డం వెన‌క ఈ సినిమా వీకెండ్‌లో ఒక రోజు ముందుగా రావ‌డ‌మే కార‌ణంగా క‌నిపిస్తోంది.

వీకెండ్‌లో గురువార‌మే సినిమా రావ‌డంతో చాలా మంది ప్రేక్ష‌కులు శుక్ర‌, శ‌ని,ఆదివారాల్లో సినిమాను ఎంజాయ్ చేయాల‌న్న ఉద్దేశంతో ఫ‌స్ట్ రోజు అనుకున్న స్థాయిలో థియేట‌ర్ల‌కు రాలేద‌ని అక్క‌డి ట్రేడ్ టాక్‌. ఇక యూఎస్‌లో టాప్ – 10 తెలుగు సినిమాల ప్రీమియ‌ర్ వ‌సూళ్ల వివ‌రాలు ఇలా ఉన్నాయి.

టాప్-10 యూఎస్ ప్రీమియ‌ర్ తెలుగు గ్రాస‌ర్లు :

బాహుబలి 2 – $ 4517704

బాహుబలి 1 – $ 1364416

ఖైదీ నెం 150 – $ 1295613

సర్దార్ గబ్బర్‌సింగ్ – $ 616054

జనతా గ్యారేజ్ – $ 584255

జై లవకుశ – $ 560,699

బ్రహ్మోత్సవం – $ 560274

డీజే దువ్వాడ జగన్నాధం – $ 538011

శ్రీమంతుడు – $ 535984

ఆగడు – $ 523613

 

గ్యారేజ్‌ను బీట్ చేయ‌లేక‌పోయిన ‘ జై ల‌వ‌కుశ ‘ అస‌లు కార‌ణం ఇదే
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts


Share
Share