‘ జై లవకుశ ‘ హిట్టు.. బయ్యర్లు ఫట్టు 

అంత ఉరిమి ఇంతేనా కురిసింది ! అన్నట్లుగా ఎన్నో అంచనాలు ఆశలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన యంగ్ టైగర్ ఎన్టీయార్ నటించిన జై లవకుశ సినిమా బాక్సాపీస్ వద్ద హిట్ టాక్ తెచ్చుకుని అంచనాలను మించిపోయింది. ఇంతవరకు బాగానే ఉన్నా బయ్యర్లకు మాత్రం నిరాశే మిగిల్చింది. అదేంటి వసూళ్లు కూడా బాగానే ఉన్నాయి కదా ఎందుకు ఇలా జరిగింది అనే కదా మీ డౌట్ ..? అక్కడికే వస్తున్నాం .. వరుస హిట్టులతో టాలీవుడ్ ని షేక్ చేస్తున్న ఎన్టీఆర్ క్రేజ్ ని దృష్టిలో ఉంచుకుని జై లవకుశ సినిమాను భారీ రేటుకు బయ్యర్లు కొనుగోలు చేశారు.

నందమూరి కళ్యాణరామ్ ప్రొడ్యూస్ చేసిన ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ 86 కోట్లకు అమ్ముడయ్యాయి. కానీ సినిమా ఇప్పటివరకు 75 కోట్లను మాత్రమే వసూలు చేసింది.. ఇక్కడే బయ్యర్లు దెబ్బతినే పరిస్థితి ఏర్పడింది. ఈ సినిమా కొనుగోలు చేసిన ప్రతి ఏరియా డిస్టిబ్యూటర్ నష్టాలను చవిచూడ‌డం క‌న్‌ఫార్మ్‌గా క‌నిపిస్తోంది.

జై ల‌వ‌కుశ‌ నైజాం ఏరియా డిస్టిబ్యూటర్ రెండు కోట్లు, సీడెడ్ బయ్యర్లు కోటిన్నర , గుంటూరు కృష్ణ బయ్యర్లు రెండుకోట్లు, తూర్పుగోదావరి బయ్యర్ 25 – 30 లక్షలు , పశ్చిమగోదావరి 70 లక్షలు నెల్లూరు 40 లక్షలు, కర్ణాటక 50 లక్షలు , ఓవర్శిస్ డిస్టిబ్యూటర్ 50 లక్షల వరకు నష్టపోతున్నట్లు సమాచారం. సినిమాకు మంచి టాక్ వ‌చ్చినా అన్ని ఏరియాల్లోను బ‌య్య‌ర్లు దెబ్బ‌తిన‌డం కాస్త నిరాశే. ఆపరేషన్ సక్సెస్ పేషేంట్ డెడ్ అంటే ఇదే మరి..!