‘ జై ల‌వ‌కుశ ‘ 5 డేస్ వ‌ర‌ల్డ్‌వైడ్ క‌లెక్ష‌న్స్‌

September 26, 2017 at 6:20 am
Jai Lava kusa, NTR, World wide Collections

యంగ్‌టైగ‌ర్ బాక్సాఫీస్ స్టామినా ఏంటో మ‌రోసారి రుజువైంది. ఎన్టీఆర్ లేటెస్ట్ మూవీ జై ల‌వ‌కుశలో ఎన్టీఆర్ కెరీర్‌లోనే ఫ‌స్ట్ టైం ట్రిబుల్ రోల్ చేయ‌డంతో పాటు అందులో ఒక‌టి నెగిటివ్ రోల్ కావ‌డంతో సినిమాకు క‌ళ్లుచెదిరిపోయే ఓపెనింగ్స్ వ‌చ్చాయి. తొలి రోజే వ‌ర‌ల్డ్ వైడ్‌గా రూ.47 కోట్ల గ్రాస్‌, 30 కోట్ల షేర్ రాబ‌ట్టిన జై ల‌వ‌కుశ మూడు రోజుల‌కు రూ.75 కోట్ల గ్రాస్‌, నాలుగు రోజుల‌కు రూ.94 కోట్ల గ్రాస్ రాబ‌ట్టింది.

ఇక ఓవ‌ర్సీస్‌లో ఆదివారం ఈ సినిమా 1 లక్ష 64 వేల 608 డాలర్లను కొల్లగొట్టి.. ఓవరాల్‌గా 14 లక్షల 46 వేల 691 డాలర్లను (9.51 కోట్ల రూపాయలను) కలెక్ట్ చేసింది. సోమ‌వారం వ‌సూళ్లు కూడా క‌లుపుకుంటే ఇవి మ‌రింత‌గా పెర‌గ‌నున్నాయి. అక్క‌డ త్వ‌ర‌లోనే 2 మిలియ‌న్ డాల‌ర్ల మార్క్‌ను క్రాస్ చేసేయ‌నుంది.

ఇక సోమ‌వారం వ‌ర‌ల్డ్‌వైడ్‌గా అన్ని సెంట‌ర్ల‌లో క‌లిపి రూ.5 కోట్ల షేర్ రాబ‌ట్టిన‌ట్టు తెలుస్తోంది. నాలుగు రోజుల లాంగ్ వీకెండ్ త‌ర్వాత కూడా వీక్‌డేస్‌లో ఈ రేంజ్‌లో వ‌సూళ్లు రాబ‌ట్ట‌డం గ్రేటే. అయితే ఈ సినిమాకు మంగ‌ళ‌వారం ఒక్క రోజు మాత్ర‌మే ఫ్రీ టైం మిగిలి ఉంది. బుధ‌వారం నుంచి థియేట‌ర్ల‌లోకి స్పైడ‌ర్ దిగ‌నుండ‌డంతో జై ల‌వ‌కుశ వ‌సూళ్లు త‌గ్గుముఖం ప‌ట్టనున్నాయి.

ఇక ఈ సినిమా 5వ రోజు ఏపీ, తెలంగాణ ఏరియా వైజ్ వ‌సూళ్లు ఇలా ఉన్నాయి.

నైజాం – 0.95 ల‌క్ష‌లు

సీడెడ్ – 0.63 ల‌క్ష‌లు

వైజాగ్ – 0.35 ల‌క్ష‌లు

ఈస్ట్ – 0.21 ల‌క్ష‌లు

వెస్ట్ – 0.18 ల‌క్ష‌లు

కృష్ణా – 0.22 ల‌క్ష‌లు

గుంటూరు – 0.24 ల‌క్ష‌లు

నెల్లూరు – 0.12 ల‌క్ష‌లు

—————————————————

ఏపీ+తెలంగాణ 5 వ‌రోజు షేర్ = 2.9 కోట్లు


 

‘ జై ల‌వ‌కుశ ‘ 5 డేస్ వ‌ర‌ల్డ్‌వైడ్ క‌లెక్ష‌న్స్‌
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts


Share
Share