జై ల‌వ‌కుశ వ‌ర్సెస్ స్పైడ‌ర్ గెలుపెవ‌రిదో తేలిపోయింది

ఈ ద‌స‌రాకు భారీ అంచ‌నాల మ‌ధ్య రిలీజ్ అయిన జై ల‌వ‌కుశ‌, స్పైడ‌ర్ సినిమాలు రెండూ మిక్స్‌డ్ టాక్‌తోనే స్టార్ట్ అయ్యాయి. ఇక  ఈ రెండు సినిమాల్లో ఇప్పుడు ఏది పైచేయి సాధించింది అన్న‌ది చెప్పుకుంటే మ‌రో రెండు మూడు రోజుల వ‌ర‌కు గాని క్లారిటీ రాదు. అయితే ఫ‌స్ట్ డే వ‌ర‌కు చూసుకుంటే ఎవ‌రిది పైచేయో వ‌సూళ్ల లెక్క‌ల ద్వారా కొంత వ‌ర‌కు క్లారిటీ వ‌చ్చింది. 

ఈ నెల 21న రిలీజ్ అయిన ఎన్టీఆర్ జై ల‌వ‌కుశ సినిమాకు మిక్స్‌డ్ టాక్ వ‌చ్చినా జై పాత్రలో ఎన్టీఆర్ నటనను చూసేందుకే ప్రేక్షకులు సినిమాకు వెళ్తున్నారనడంలో ఏమాత్రం సందేహం లేదు. మాస్, ఫ్యామిలీ, క్లాస్ ఆడియన్స్‌ను ఆకట్టుకుంటూ వంద కోట్ల రూపాయల మార్కును దాటేసింది జై లవకుశ. 

ఇక స్పైడ‌ర్ మురుగ‌దాస్ – మ‌హేష్‌బాబు కాంబో కావ‌డంతో భారీ అంచ‌నాల‌తో రిలీజ్ అయ్యి మిక్స్‌డ్ టాక్ తెచ్చుకుంది. ఈ రెండు సినిమాల్లో ఓవ‌ర్సీస్‌లో జై ల‌వ‌కుశ ప్రీమియ‌ర్ల ద్వారా 3.39 కోట్లు కలెక్ట్ చేసింది. ఇక స్పైడ‌ర్ 6.59 కోట్లు సాధించింది. ప్రీమియ‌ర్ల వ‌ర‌కు జై ల‌వ‌కుశ‌పై స్పైడ‌ర్ పైచేయి సాధించింది. 

ఇక ప్రపంచవ్యాప్తంగా మొదటి రోజు కలెక్షన్ల విషయానికి వస్తే జై ల‌వ‌కుశ‌ ఏకంగా 48 కోట్ల రూపాయలు కలెక్ట్ చేసింది. ఎన్టీఆర్ కెరీర్లో ఇదే బిగ్గెస్ట్ ఓపెనర్‌. స్పైడర్ ప్రపంచ వ్యాప్తంగా మొదటి రోజు 38 కోట్ల రూపాయలను కలెక్ట్ చేసింది. ఈ లెక్కన ఓవర్సీస్‌లో స్పైడర్.. ఓవరాల్‌గా జై లవకుశ మొదటి రోజు కలెక్షన్ల విషయంలో విన్ అయ్యింది.