‘ జై ల‌వ‌కుశ ‘ స్టోరీ ఇదే

September 12, 2017 at 10:03 am
Jai Lava Kusa, NTR

టాలీవుడ్ యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్ లేటెస్ట్ మూవీ జై ల‌వ‌కుశ‌. ఎన్టీఆర్ కెరీర్‌లోనే సూప‌ర్ ఫామ్‌లో ఉండ‌డంతో స‌హజంగానే ఈ సినిమాపై భారీ అంచ‌నాలు ఏర్ప‌డ‌డం, అందుకు త‌గ్గ‌ట్టుగా రూ. 112 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ జ‌ర‌గ‌డంతో ఈ సినిమా స్టోరీ ఎలా ఉంటుందా ? ఎన్టీఆర్ త్రిపాత్రాభిన‌యం ఎలా ర‌క్తి క‌ట్టిస్తుందా ? సినిమా ఎప్పుడు థియేట‌ర్ల‌లోకి వ‌స్తుందా ? అని జ‌నాలు ఎంతో ఉత్కంఠ‌తో వెయిట్ చేస్తున్నారు.

ఎన్టీఆర్ స‌ర‌స‌న రాశీఖ‌న్నా, నివేదా థామస్ హీరోయిన్లుగా కేఎస్‌.ర‌వీంద్ర (బాబి) ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న ఈ సినిమా ద‌స‌రా కానుక‌గా ఈ నెల 21న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ జై, ల‌వ‌కుమార్, కుశ అనే మూడు క్యారెక్ట‌ర్ల‌ను చేస్తున్నాడు. ఇక ఈ మూడు క్యారెక్ట‌ర్ల‌ను ప‌రిచ‌యం చేస్తూ రిలీజ్ అయిన స్టిల్స్‌, టీజ‌ర్లు, ట్రైల‌ర్ కేక పుట్టించేస్తున్నాయి.

ఎన్టీఆర్ త్రిపాత్రాభిన‌యంతో సినిమా క‌థ ఎలా ఉంటుంది ? అన్న‌దానిపై ఇండ‌స్ట్రీ ఇన్న‌ర్ స‌ర్కిల్స్‌లో ఓ ఆస‌క్తిక‌ర క‌థ‌నం వినిపిస్తోంది. జై, ల‌వ‌, కుశ‌లు ఓకే తల్లి క‌డుపున పుట్టిన అన్న‌ద‌మ్ములు. వీరిలో ల‌వ‌, కుశ ఒక చోట పెరిగితే జై మ‌రో చోట పెరుగుతాడు. జైకు అనుకోని ప‌రిస్థితుల్లో త‌న సోద‌రులు అయిన ల‌వ‌, కుశ‌పై ప‌గ పెంచుకుంటాడు.

ల‌వ‌కుమార్ ఓ బ్యాంక్ మేనేజ‌ర్‌గా ప‌ని చేస్తుంటాడు. ఓ ప్ర‌మాదంలో ల‌వ‌కుమార్ క‌ళ్లు కోల్పోవ‌డంతో ఆ ప్లేస్‌లోకి కుశ మేనేజ‌ర్‌గా ఎంట్రీ ఇస్తాడు. అక్క‌డ కుశ చేసే కామెడీ సినిమాకే హైలెట్‌. ఇక సినిమాలో విల‌న్ రోల్ అయిన జై రావణ్‌ మాత్రం సినిమాపై ఆసక్తిని కలిగిస్తుంది. అయితే సినిమాలో రెండు అదిరిపోయే ట్విస్టులు కూడా ఉంటాయ‌ని తెలుస్తోంది.

సినిమాలో ముందునుంచి విల‌న్‌గా ఉన్న ఓ రోల్ చివ‌ర్లో మంచివాడు అని తేలితే, ముందు నుంచి హీరోగా ఉన్న రోల్ చివ‌ర్లో విల‌న్ అని తేలుతుంద‌ట‌. అయితే ఈ రెండు క్యారెక్ట‌ర్లు ఏంట‌న్న‌ది ఇంకా క్లారిటీ లేదు. ఈ స్టోరీ వింటుంటేనే చాలా ఇంట్రస్టింగ్‌గా ఉంది. ఇక థియేట‌ర్లో బాబి ట్రీట్‌మెంట్ కూడా బాగుంటే విజిల్స్‌, క్లాప్స్ ఆగ‌వ్‌.

 

‘ జై ల‌వ‌కుశ ‘ స్టోరీ ఇదే
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts


Share
Share