‘ జై ల‌వ‌కుశ ‘ 3 డే క‌లెక్ష‌న్స్‌

September 24, 2017 at 9:38 am
Jai Lava Kusa, NTR, Collections

యంగ్‌టైగ‌ర్ జై ల‌వ‌కుశ‌తో మూడో రోజు కూడా బాక్సాఫీస్ వ‌ద్ద త‌న దూకుడు చూపించాడు. తొలి రెండు రోజుల్లో వ‌ర‌ల్డ్ వైడ్‌గా రూ.61 కోట్ల గ్రాస్ కొల్ల‌గొట్టిన ఎన్టీఆర్ రూ.38 కోట్ల షేర్ రాబ‌ట్టాడు. ఇక ఓవర్సీస్‌లో మిలియ‌న్ డాల‌ర్ల మార్క్ దాటేసి 1.5 మిలియ‌న్ డాల‌ర్ల మార్క్ దిశ‌గా దూసుకుపోతున్నాడు. ఇక మూడో రోజు శ‌నివారం కూడా ఏపీ, తెలంగాణ‌లో రూ 5.5 కోట్ల షేర్ రాబ‌ట్టాడు. ఇక నాలుగో రోజు ఆదివారం కావ‌డంతో భారీ వ‌సూళ్లు ద‌క్క‌నున్నాయి.

తొలి రోజే ఏపీ, తెలంగాణ‌లో రూ 21.40 కోట్ల షేర్ రాబ‌ట్టిన ఈ సినిమా రెండో రోజు కూడా త‌న జోరు చూపిస్తూ రూ 6.28 కోట్ల షేర్ కొల్ల‌గొట్టింది. మూడో రోజు 5.5 కోట్ల షేర్ రాబ‌ట్టింది.

ఏపీ, తెలంగాణ వ‌ర‌కు చూసుకుంటే మూడో రోజు జై ల‌వ‌కుశ ఏరియా వైజ్ 3వ రోజు షేర్ :

నైజాం – 2.10 కోట్లు

సీడెడ్ – 1.18 కోట్లు

నెల్లూరు – 0.17 కోట్లు

గుంటూరు – 0.40 కోట్లు

కృష్ణా – 0.41 కోట్లు

వెస్ట్ – 0.28 కోట్లు

ఈస్ట్ – 0.32 కోట్లు

ఉత్త‌రాంధ్ర – 0.72 కోట్లు

—————————————————–

3వ రోజు ఏపీ+తెలంగాణ షేర్ = 5.58 కోట్లు

—————————————————–

 

‘ జై ల‌వ‌కుశ ‘ 3 డే క‌లెక్ష‌న్స్‌
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts


Share
Share