‘ జై ల‌వ‌కుశ ‘ 2 డేస్ ఏరియా వైజ్ క‌లెక్ష‌న్స్‌

September 23, 2017 at 5:24 am
Jai Lava Kusa, NTR

యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్ రెండో రోజు కూడా బాక్సాఫీస్‌ను దున్నేశాడు. థియ‌ట‌ర్ల వ‌ద్ద వ‌సూళ్ల‌లో భీభ‌త్సం క్రియేట్ చేసి ప‌డేశాడు. తొలి రోజే ఏపీ, తెలంగాణ‌లో రూ 21.40 కోట్ల షేర్ రాబ‌ట్టిన ఈ సినిమా రెండో రోజు కూడా త‌న జోరు చూపిస్తూ రూ 6.28 కోట్ల షేర్ కొల్ల‌గొట్టింది. రెండు రోజులకు కలిపి 28.11 కోట్ల రూపాయల షేర్ సాధించాడు. రెండు రోజుల‌కే దాదాపుగా రూ.30 కోట్ల షేర్ రావ‌డంతో ఇప్పుడు కేవ‌లం రెండు తెలుగు రాష్ట్రాల్లోనే చాలా స్పీడ్‌గా జై ల‌వ‌కుశ రూ.50 కోట్ల షేర్ క్ల‌బ్‌లోకి ఎంట్రీ ఇవ్వ‌నుంది.

జై ల‌వ‌కుశ ఏరియా వైజ్ 2 డేస్ షేర్ :

నైజాం – 7.33 కోట్లు

సీడెడ్ – 5.60 కోట్లు

నెల్లూరు – 1.28 కోట్లు

గుంటూరు – 3.48 కోట్లు

కృష్ణా – 2.18 కోట్లు

వెస్ట్ – 2.15 కోట్లు

ఈస్ట్ – 3.39 కోట్లు

ఉత్త‌రాంధ్ర – 2.70 కోట్లు

—————————————————–

2 డేస్ ఏపీ+తెలంగాణ షేర్ = 28.11 కోట్లు

—————————————————–

ఇక యూఎస్‌లో కూడా గురు, శుక్రవారాల్లో కూడా జై లవకుశ వసూళ్లు బలంగా కొనసాగుతున్నాయి. 154,942 డాలర్లని గురువారం వసూలు చేసింది. శుక్ర‌వారం రాత్రి అప్‌డేట్ ప్ర‌కారం చూస్తే ఈ చిత్రం ఓవర్సీస్ లో 977,941 డాలర్లకి రాబట్టి శుక్రవారానికే 1 మిలియన్ డాలర్ల వసూళ్లకు చేరువైపోయింది. అక్క‌డ శ‌ని, ఆదివారాలు కూడా సెల‌వులు కావ‌డంతో ఈ వ‌సూళ్లు మ‌రింత పెగ‌ర‌నున్నాయి.

 

 

‘ జై ల‌వ‌కుశ ‘ 2 డేస్ ఏరియా వైజ్ క‌లెక్ష‌న్స్‌
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts


Share
Share