జీయో మ‌రో సంచ‌ల‌నం.. గిగాపైబ‌ర్ బ్రాడ్‌బాండ్‌..

July 6, 2018 at 1:24 pm

నెట్ ప్ర‌పంచంలో సంచ‌ల‌నం స‌`ష్టించిన జియో మ‌రికొద్ది రోజుల్లోనే అంత‌కుమించిన స‌రికొత్త సంచ‌ల‌నం స‌`ష్టించ‌బోతోంది. వైర్‌లెస్ బ్రాడ్‌బాండ్ సేవ‌ల ద్వారా మొబైల్ టెలికం రంగంలో విప్ల‌వాత్మ‌క మార్పుల‌కు శ్రీ‌కారం చుట్టిన ముఖేశ్ అంబానీ.. ఇప్పుడు జియోగిగా ఫైబ‌ర్ పేరుతో మునుపెన్న‌డూ లేని విధంగా.. అత్యంత వేగంతో.. కేవ‌లం మిల్లీ సెకండ్ల కాలంలోనే అప్‌లోడ్‌, డౌన్‌లోడ్ అనుభ‌వాన్ని క‌స్ట‌మ‌ర్ల‌కు అందించ‌బోతున్నారు. దేశ‌వ్యాప్తంగా 1100 ప‌ట్ట‌ణాల్లో ఇళ్లు, సంస్థ‌లే ల‌క్ష్యంగా ఈ సేవ‌ల‌ను అందుబాటులోకి తీసుకురాబోతున్నారు ముఖేశ్‌. ఓ ఆల్ట్రా హైస్పీడ్ ఫిక్స్‌డ్ లైన్ బ్రాడ్‌బాండ్‌ను ఆయ‌న తెర‌పైకి తీసుకొస్తున్నారు.

ముంబైలో గురువారం జరిగిన రిల‌య‌న్స్ ఇండ‌స్ట్రీస్ లిమిటెడ్ 41వ వార్షిక సాధార‌ణ స‌మావేశంలో ముఖేశ్ ఈ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. దేశ స్వాతంత్ర్య‌ దినోత్స‌వం ఆగ‌స్టు 15వ తేదీ నుంచి జియోగిగా ఫైబ‌ర్ కోసం క‌స్ట‌మ‌ర్లు రిజిస్ట‌ర్లు చేసుకోవ‌చ్చున‌ని ఆయన వెల్ల‌డించారు. అయితే.. ఈ సేవ‌ల‌ను ఎప్పుడు ప్రారంభించేది.. ధ‌ర‌ల విధానాన్ని మాత్రం ముఖేశ్ వెల్ల‌డించ‌లేదు. ఈ జియోగిగాఫైబ‌ర్ విధానంలో అందే సేవ‌ల‌ను మాత్రం చెప్పారు. భారీ టెలివిజ‌న్ల‌పై హైస్పీడ్ ఇంట‌ర్నెట్‌, అల్ట్రా హై డెఫినిష‌న్ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌, మ‌ల్టీ పార్టీ వీడియో కాన్ఫ‌రెన్సింగ్‌, వాయిస్ ఆక్టివేటెడ్ వ‌ర్చువ‌ల్ అసిస్టెన్స్‌, వ‌ర్చువ‌ల్ రియాల్టీ గేమింగ్‌, డిజిట‌ల్ షాపింగ్‌, స్మార్ట్ హోల్ సొల్యూష‌న్స్ స‌దుపాయాలు ఉండ‌నున్నాయి.

నిజానికి ఇత‌ర దేశాల‌తో పోల్చితే భార‌త‌దేశంలో ఫైబ‌ర్‌బ్రాడ్‌బాండ్ సేవ‌లు చాలా త‌క్కువ‌గా ఉన్నాయ‌నే చెప్పాలి. చైనాలో ఈ సేవ‌లు 85శాతంగా ఉంటే.. భార‌త్‌లో కేవ‌లం..0.5శాతం మాత్ర‌మే ఉన్నాయి. మన దేశంలో బ్రాడ్‌బ్యాండ్‌ సేవలు 7 శాతంగా ఉంటే అందులో ఫైబర్‌ సేవలు కేవలం 0.5 శాతం మాత్రమే ఉండ‌డం గ‌మ‌నార్హం. వైర్‌లెస్ బ్రాడ్‌బాండ్ విభాగంలో ప్ర‌పంచ‌స్థాయిలో కొంత‌మేర‌కు మెరుగుప‌డిన భార‌త్ .. ఫిక్స్‌డ్ లైన్ బ్రాడ్‌బాండ్ విభాగంలో మాత్రం 134స్థానంలో ఉంద‌నే స్వ‌యంగా ముఖేశ్ ప్ర‌క‌టించారు. అందుకే రూ.2.5ల‌క్ష‌ల కోట్ల‌తో జియో ఫైబర్‌ బ్రాడ్‌బ్యాండ్ ప్రాజెక్టును చేప‌డుతోంది. ఇప్ప‌టికే జియోకు 21 కోట్ల మంది చందాదారులున్నారు.

జీయో మ‌రో సంచ‌ల‌నం.. గిగాపైబ‌ర్ బ్రాడ్‌బాండ్‌..
0 votes, 0.00 avg. rating (0% score)

commentsShare
Share