అక్క‌డ‌ వైసీపీ దూకుడు.. ఏం జ‌రుగుతోందంటే..

October 20, 2018 at 12:04 pm
jonnalagadda padmavathi vs yamini bala

ఎన్నిక‌లు స‌మీపిస్తున్న నేప‌థ్యంలో రాష్ట్రంలో రాజ‌కీయాలు ఊపందుకున్నాయి. మ‌రో ఆరేడు మాసాల్లోనే ఎన్నిక‌లు ఉన్న నేప‌థ్యంలో అధికారంలోకి వ‌చ్చి తీరాల‌ని వైసీపీ నిర్ణ‌యించుకుంది. ఈ క్ర‌మంలోనే అధికార పార్టీపై దూకుడు పెంచింది. ఇక‌, గ‌త ఎన్నిక‌ల్లో టీడీపీ అభ్య‌ర్థుల‌పై ఓడిపోయిన వైసీపీ నాయ‌కులు కూడా మ‌రింత వేగం పెంచారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎట్టి ప‌రిస్థితిలోనూ గెలిచి తీరాల‌ని నిర్న‌యించుకున్నారు. దీనికి గాను ప్ర‌జ‌ల్లో విస్తృతంగా తిరుగుతూనే టీడీపీ నేత‌ల వీక్‌నెస్‌పైనా దెబ్బ‌కొడుతున్నారు. ఇదే విష‌యంలో నాలుగు అడుగులు ముందుకు వేశారు అనంత‌పురం జిల్లా ఎస్సీ నియోజ‌క‌వ‌ర్గం శింగ‌న‌మ‌ల నుంచి పోటీ చేసి ఓడిపోయిన వైసీపీ నాయ‌కురాలు.. జొన్న‌ల‌గ‌డ్డ ప‌ద్మావ‌తి.

maxresdefault

గ‌త ఎన్నిక‌ల్లో శింగ‌న‌మ‌ల నియోజ‌క‌వ‌ర్గం నుంచి టీడీపీ త‌ర‌పున మాజీ ఎమ్మెల్యే, ప్ర‌స్తుత ఎమ్మెల్సీ శ‌మంత‌క‌మ‌ణి కుమా ర్తె.. యామినీ బాల పోటీ చేసి విజ‌యం సాధించారు. అదేస‌మయంలో ఇక్క‌డ నుంచి బ‌రిలోకి దిగిన వైసీపీ నాయ‌కురాలు.. ప‌ద్మావ‌తి.. ఓట‌మి పాల‌య్యారు. అయినా కూడా ఆమె నిత్యం ప్ర‌జ‌ల్లోనే ఉంటున్నారు. వారి స‌మ‌స్య‌ల‌ను ప‌ట్టించుకుని, ప్ర‌శ్నిస్తున్నారు. ఉద్య‌మాల‌కు కూడా శ్రీకారం చుట్టారు. ఇక‌, ఇక్క‌డ నుంచి విజ‌యం సాధించిన యామినీ బాల‌.. ఆదిలోనే ఎస్సీ కోటాలో త‌న‌కు మంత్రి ప‌ద‌వి ద‌క్కుతుంద‌ని భావించారు. అయితే, ఆమె ఆశ‌లు నెర‌వేర‌క‌పోవ‌డంతో మౌనంగా ఉండిపోయారు. త‌ర్వాత 2017లో జ‌రిగిన మంత్రి వ‌ర్గ విస్త‌ర‌ణ‌లో అయినా త‌న‌కు అవ‌కాశం ల‌భిస్తుంద‌ని అనుకున్నారు.

కానీ, అది కూడా ద‌క్క‌లేదు. దీంతో నియోజ‌క‌వ‌ర్గంలో అంటీ ముట్ట‌న‌ట్టే వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఇదే విష‌యాన్ని ప‌ద్మావ‌తి ప్ర‌జ‌ల్లోకి విస్తృతంగా తీసుకు వెళ్తున్నారు. ఎక్క‌డి అభివృద్ధి అక్క‌డే ఉంద‌ని, ఎమ్మెల్యే నిద్ర పోతున్నార‌ని ప‌ద్మావ‌తి విస్తృతంగా ప్ర‌చారం చేస్తున్నారు. దీంతో యామినీబాల ఇక్క‌డ జ‌రుగుతున్న అభివృద్ధిపై బ‌హిరంగ చ‌ర్చ‌కు సిద్ధ‌మ‌ని ప్ర‌క‌టించారు. దీంతో ఒక్క‌సారిగా నియోజ‌క‌వ‌ర్గంలో రాజ‌కీయ వేడి రాజుకుంది. ఎమ్మెల్యే యామిని బాల, స్థానిక వైసీపీ ఇన్‌ఛార్జ్‌ జొన్నలగడ్డ పద్మావతి చర్చకి సిద్ధపడ్డారు. అయితే పోలీసులు ఇరు వర్గాలనూ అడ్డుకున్నారు. దీంతో ఇరు ప‌క్షాలు మీడియా వేదిక‌గా.. ఆరోప‌ణ‌లు సంధించుకున్నాయి. కానీ, యామినీ బాల గ్రాఫ్ బాగోలేద‌ని సాక్షాత్తూ.. టీడీపీ నాయ‌కులే చెప్ప‌డం గ‌మ‌నార్హం. అదేస‌మ‌యంలో వైసీపీ పుంజుకోవ‌డం, దీంతో వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఇక్క‌డ వైసీపీ జెండా ఎగురుతుంద‌ని చెబుతున్నారు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.

అక్క‌డ‌ వైసీపీ దూకుడు.. ఏం జ‌రుగుతోందంటే..
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share