ఈ సినిమా ఎన్టీఆర్ కెరీర్‌లోనే తిరుగులేని బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్

నాలుగు వ‌రుస హిట్ల‌తో కెరీర్‌లో పిచ్చ పీక్‌స్టేజ్‌లో ఉన్న మ‌న తార‌క్ ఎలాంటి పాత్ర‌ను అయినా అవ‌లీల‌గా చేసేస్తాడ‌న్న పేరు తెచ్చుకున్నాడు. ఎన్టీఆర్ యాక్టింగ్‌కు ఇప్ప‌టికే మ‌హామ‌హాలైన హీరోలే ఫిదా అయితే ఇప్పుడు తాజాగా జై ల‌వ‌కుశ సినిమాలోని జై క్యారెక్ట‌ర్ చూశాక చాలామందికి నోట మాట రావ‌డం లేదు. జై ల‌వ‌కుశ హిట్ కేట‌గిరిలోకి చేరిపోవ‌డంతో ఇప్పుడు ఎన్టీఆర్ నెక్ట్స్ సినిమాపై అంచ‌నాలు మామూలుగా లేవు.

ఇక ఎన్టీఆర్ నెక్ట్స్ సినిమా మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్‌తో ఉంటుంద‌న్న వార్త‌లకు ఎన్టీఆర్ క్లారిటీ ఇచ్చేశాడు. ఈ సినిమా ఎన్టీఆర్ కెరీర్‌లోనే తిరుగులేని బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ అవుతుంద‌ని అంద‌రూ అంచ‌నా వేస్తున్నారు. ఇక అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌ను మెప్పించేలా సినిమాలు తీసే త్రివిక్ర‌మ్ – ఎన్టీఆర్ అంటే అంచ‌నాలు ఎలా ఉంటాయో చెప్ప‌క్క‌ర్లేదు.

ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్ రోల్ ఎలా ఉంటుందో ?  ఎన్టీఆర్ లీక్ చేసేశాడు. ఈ సినిమాలో మిలిటరీ అపరేటివ్ ఆఫీసర్ గా ఎన్టీఆర్‌ కనిపించబోతున్నాడు. అలాగే సినిమాలో త్రివిక్రమ్ మార్క్ కామెడీ మరియు ఎమోషనల్ సీన్స్ ఉంటాయట. జనవరి తర్వాత ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. ప్ర‌స్తుతం ప‌వ‌న్ 25వ సినిమాను డైరెక్ట్ చేస్తోన్న త్రివిక్ర‌మ్ ఆ సినిమాను సంక్రాంతికి థియేట‌ర్ల‌లోకి తెచ్చేందుకు ప్లాన్‌లో ఉన్నాడు. ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ అయిన వెంట‌నే త్రివిక్ర‌మ్ – ఎన్టీఆర్ మూవీ సెట్స్‌మీద‌కు వెళుతుంది.