అందరి చూపు ఎన్టీఆర్ పైనే..!

October 2, 2018 at 3:43 pm

టాలీవుడ్ లో మొదటి సారిగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ – ఎన్టీఆర్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా ‘అరవింద సమేత’. రాయలసీమ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో ఎన్టీఆర్ రెండు విభిన్నమైన పాత్రల్లో కనిపించబోతున్నాడట. మొదట రొమాంటిక్ గా కాలేజీ వాతావరణంలో సాగితే..సెకండాఫ్ మొత్తం రాయలసీమ నేపథ్యంలో ఫ్యాక్షన్ తరహాలో సాగబోతుందట. ఇంకో తొమ్మిది రోజుల్లోనే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా పోస్టర్లు, టీజర్, సాంగ్స్ సోషల్ మీడియాలో దుమ్మురేపుతున్నాయి. నేటి రాత్రి ఈ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ జరగబోతున్న విషయం తెలిసిందే. అయితే ఈ ఫంక్షన్ కి ముఖ్య అతిథిగా నందమూరి బాలకృష్ణ రాబోతున్నట్లు వార్తలు వస్తున్న విషయం తెలిసిదే.

ఇక ఎన్టీఆర్ కి ఎంతో ఇష్టమైన తన తండ్రి నందమూరి హరికృష్ణ రోడ్డు ప్రమాదంలో మరణించిన విషయం తెలిసిందే. గత కొంత కాలంగా ఎన్టీఆర్ – బాలకృష్ణ ఎడమొఖం..పెడమొఖంగా ఉన్న విషయం తెలిసిందే. అయితే హరికృష్ణ మరణంతో వీరిద్దరు కలిసి పోయారని టాక్ వినిపించింది..అందుకే ఈవెంట్ కి వస్తున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ అలాంటిది ఏదీ లేదట… స్పెషల్ గెస్టులెవ్వరూ లేకుండానే ఈ వేడుక జరగనుంది. ప్రి రిలీజ్ ఈవెంట్ పోస్టర్లలో అతిథిగా ఎవ్వరి పేరూ లేదు. దీంతో ‘అరవింద సమేత’ ఆడియో వేడుకలో ఎన్టీఆరే హైలైట్ కాబోతున్నాడు.

తనకు ఎంతో ఇష్టమైన తండ్రిని కోల్పోయిన పుట్టెడు దుఖఃంలో ఉన్న ఎన్టీఆర్ ఈ కార్యక్రమంలో ఎలా మాట్లడబోతున్నాడు..ప్రేక్షకులకు ఏం సందేశం ఇవ్వబోతున్నాడు. ఈ నేపథ్యంలో తారక్ వేదిక మీద కచ్చితంగా తన తండ్రిని తలుచుకుని ఉద్వేగానికి గురవుతాడని అనుకుంటున్నారు. ఇంతకుముందు హరికృష్ణ ఉండగానే ‘నాన్నకు ప్రేమతో’ వేడుకలో ఆయన్ని తలుచుకుని ఎమోషనల్ అయ్యాడు. అందుకే తెలుగు రాష్ట్రంలో నందమూరి అభిమానులంతా సాయంత్ర జరిగే వేడుకను చూసేందుకు ఎంతో ఉత్సాహం చూపిస్తున్నారు.

అందరి చూపు ఎన్టీఆర్ పైనే..!
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share